Kamal Haasan: ఆ పార్టీతో పొత్తు ఉంటుందా లేదా.. క్లైమాక్స్ ఇప్పుడే చెప్పలేను!
ABN , First Publish Date - 2023-03-01T13:22:21+05:30 IST
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని, కథను సీన్ బై సీన్‌గా ముందుకు తీసుకెళ్ళా
అడయార్(చెన్నై): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని, కథను సీన్ బై సీన్‌గా ముందుకు తీసుకెళ్ళాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) తనదైన సినిమాటిక్ శైలి లో వ్యాఖ్యానించారు. మార్చి 1న డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక ప్యారీస్‌లోని రాజా అన్నామలై మండ్రంలో స్టాలిన్ 70పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కమల్‌హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్(Stalin).. దివంగత మహానేత కలైంజర్ తనయుడిగా ఉన్నప్పటి నుంచి తనకు బాగా తెలుసన్నారు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయన్నారు. సంతోషా న్ని అనుభవిస్తూ, కష్టాలను ఎదురీదుతూ అం చెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగా, మేయర్‌గా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఇపుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారని వివరించారు. స్టాలిన్‌కు కేవలం సహనం, ఓర్పు మాత్రమే కాకుండా, ప్రతిభ కూడా పుష్కలంగా ఉందన్నారు. అప్పుడప్పుడు చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన తరుణం ఉందని, ఈ చరిత్రను తిరగ రాయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు కమల్ హాసన్ తెలిపారు.
ఇదికూడా చదవండి: సిసోడియా ప్లేస్‌లో ఎవరు? రాజీనామాల ఆమోదానికి కారణం ఏమిటి?