Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్
ABN , First Publish Date - 2023-07-06T10:59:02+05:30 IST
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిపోయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇదంతా తమాషాగా మారిపోయిందని, చట్టమే ఇటువంటివాటికి అనుమతిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం మాట్లాడబోతున్న తరుణంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిపోయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇదంతా తమాషాగా మారిపోయిందని, చట్టమే ఇటువంటివాటికి అనుమతిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం మాట్లాడబోతున్న తరుణంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అజిత్ పవార్ నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు జూలై 2న మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. అజిత్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇరు వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశాలు నిర్వహించారు.
కపిల్ సిబల్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, మహారాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇది ‘తమాషా’ అని, చట్టమే దీనిని అనుమతిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇదంతా అధికారమనే రొట్టెల గురించేనని, ప్రజల గురించి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్‌సీపీని శరద్ పవార్ 1999లో స్థాపించారు. ఈ పార్టీని ఆయన సమీప బంధువు అజిత్ పవార్ చీల్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ మట్టికొట్టుకుపోయాయని శరద్ పవార్ ఆయనకు గుర్తు చేశారు. ఇదిలావుండగా, తనదే అసలైన ఎన్‌సీపీ అని ప్రకటించాలని అజిత్ పవార్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..