Karnataka CM : అధికారికంగా కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటన మరికాసేపట్లో!

ABN , First Publish Date - 2023-05-17T12:20:47+05:30 IST

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరుపై నాలుగు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Karnataka CM : అధికారికంగా కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటన మరికాసేపట్లో!
Siddaramaiah,

న్యూఢిల్లీ : కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరుపై నాలుగు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) బుధవారం సాయంత్రం అధికారికంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.

ఈ పదవి కోసం పోటీ పడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌తో కాంగ్రెస్ పెద్దలు బుధవారం కూడా మంతనాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. అధికారికంగా సిద్ధరామయ్య పేరును ఖర్గే ప్రకటించిన తర్వాత సిద్ధరామయ్య గురువారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ, ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఆయనకు వేరొక కీలక పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించే అవకాశం ఉందని, అప్పుడు కాంగ్రెస్‌ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పని చేయడంతోపాటు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉండటంతో ఆయనవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సామాన్య ప్రజల్లో ఆయనకు ఆకర్షణ ఉండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయినట్లు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..

Updated Date - 2023-05-17T12:26:09+05:30 IST