Assembly polls: మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-27T08:04:34+05:30 IST

మేఘాలయ, నాగాలాండ్‌లలో సోమవారం ఉదయం గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది....

Assembly polls: మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం
Meghalaya, Nagaland Vote Today

షిల్లాంగ్, కోహిమా: మేఘాలయ, నాగాలాండ్‌లలో సోమవారం ఉదయం గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. (Meghalaya, Nagaland)60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీ కి జరుగుతున్న ఎన్నికల్లో 369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీకి భారతీయ జనతాపార్టీ నుంచి గట్టి పోటి నెలకొంది. గతంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ పాలన సాగించింది. మేఘాలయలో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కన్నేసింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది. 640 పోలింగ్ కేంద్రాల్లో 323 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మేఘాలయలో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా సాగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎఫ్ఆర్ ఖర్ కోంగర్ చెప్పారు.

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 59 అసెంబ్లీ స్థానాల్లో 183 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాగాలాండ్ లో 13 లక్షల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఉదయం గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.(Polling began Today) అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ 23, 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పోలింగ్ కోసం 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది.

నాగాలాండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు మహిళా అభ్యర్థుల స్థానాలపై అందరి దృష్టి ఉంది. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని మోదీ(Narendra modi) ప్రజలను కోరారు.తొలిసారి ఓట్లు వేయనున్న యువకులపై మోదీ దృష్టి సారించారు.మేఘాలయ, నాగాలాండ్ ప్రజలను, ముఖ్యంగా యువకులు, మొదటి సారి ఓటు హక్కు పొందిన ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓట్లు వేయాలని ప్రధాని ట్వీట్‌లో(Tweet) కోరారు.

Updated Date - 2023-02-27T08:07:31+05:30 IST