Michaung: మిచౌంగ్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు
ABN , First Publish Date - 2023-12-06T07:49:01+05:30 IST
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఉన్న బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఉన్న బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చైన్నై, ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. చైన్నైలో వర్షం సంబంధిత ఘటనల్లో కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటలు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవొచ్చు.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ కోస్తాంద్ర, ఒడిశాలోని దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో ఒడిశాలోని దక్షిణ జిల్లాలు మంగళవారం రాత్రి అప్రమత్తమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతంలోనూ ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. "ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. రాబోయే 24 గంటల్లో కురిసే వర్షాల తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిపాలనా యంత్రాంగం అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది" అని కోరాపుట్ కలెక్టర్ అబ్దాల్ అక్తర్ అన్నారు. కాగా భారీ వర్షాల కారణంగా చైన్నైలోని విమానశ్రయం రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో సోమవారం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏకంగా వెయ్యికి పైగా విమానాలు బంద్ అయ్యాయి. అయితే సోమవారం చెన్నైలో వర్షాలు తగ్గాయి. దీంతో రన్‌వేపై ఉన్న నీటిని సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో మంగళవారం విమాన రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.