Mizoram: మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టివేత

ABN , First Publish Date - 2023-06-25T09:53:08+05:30 IST

మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. మమిత్ పట్టణంలో సుమారు రూ.17 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Mizoram: మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టివేత

మమిత్ టౌన్: మిజోరాంలో(Mizoram) భారీగా హెరాయిన్(Heroin) పట్టుబడింది. మమిత్ పట్టణంలో(Mamit Town) సుమారు రూ.17 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా.. త్రిపుర రిజిస్ట్రేషన్‌తో(Tripura Registration) ఉన్న బొలెరో వాహనంలో తరలిస్తున్న 3.4 కేజీల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. త్రిపురకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ కాన్సెస్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-06-25T09:53:12+05:30 IST