Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ బిగ్ షాక్...30మంది ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం?

ABN , First Publish Date - 2023-04-18T11:58:33+05:30 IST

మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)(NCP)కి చెందిన అజిత్ పవార్ 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో బీజేపీ చేరనున్నారని వార్తలు సంచలనం...

Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ బిగ్ షాక్...30మంది ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం?
NCPs Ajit Pawar

మహారాష్ట్ర రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని వార్తలు సంచలనం రేపాయి...

ముంబయి: మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)(NCP)కి చెందిన అజిత్ పవార్ 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో బీజేపీ చేరనున్నారని వార్తలు సంచలనం రేపాయి.(Ajit Pawar) మంగళవారం అజిత్ పవార్ ముంబయిలో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం.30 నుంచి 34 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు(Oppn MLAs in support) అజిత్ పవార్ బాటలో పయనించేందుకు వీలుగా బీజేపీ తీర్థం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తిరుగుబాటు శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక సంవత్సరం లోపే ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరనుండటం(Ajit Pawar joining BJP) కలకలం రేపుతోంది.రాబోయే రోజుల్లో తమ నాయకుడు అజిత్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయనకు విధేయులుగా ఉంటామని ఎన్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.కాగా శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఇటీవల ఉద్ధవ్ ఠాక్రేతో కలిసినపుడు తమ పార్టీ ఎప్పటికీ బీజేపీతో చేతులు కలపదని చెప్పినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Nepal: అన్నపూర్ణ పర్వతం నుంచి భారతీయ పర్వతారోహకుడి అదృశ్యం

ఇటీవల ఎంఎస్‌సీ బ్యాంక్ కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో అజిత్ పవార్, అతని భార్య సునేత్రల పేర్లను తొలగించింది.ఇతర నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, ధనంజయ్ ముండేతో సహా ప్రముఖులు అజిత్ పవార్ ఉద్ధేశాలను సమర్థించారని సమాచారం.అయితే రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఆ పార్టీ నేత జితేంద్ర అవద్ మాత్రం బీజేపీతో చేతులు కలపడాన్ని ఇష్టపడడం లేదు.కొంతమంది అజిత్ క్యాంపు ఎమ్మెల్యేలు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అజిత్, ఇతర ఎన్‌సీపీ నాయకులతో కలసి వస్తే, అది మహారాష్ట్రలో ఎన్‌డీఏకు క్లీన్ స్వీప్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి : Syria: సిరియాలో అమెరికా హెలికాప్టర్ దాడి...సీనియర్ ఇస్లామిక్ స్టేట్ లీడర్ మృతి

అధికార పార్టీలో చేరడం వల్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేడిని ఎదుర్కొంటున్నందున అజిత్, అతని కుటుంబం, ప్రఫుల్ పటేల్, హసన్ ముష్రీఫ్ వంటి అనేక మంది ప్రతిపక్ష నాయకులు వారికి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఉపశమనం లభించవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.అధికార పార్టీతో చేతులు కలపడం వల్ల వారి నియోజకవర్గాలకు అధిక నిధులు వస్తాయి,దీంతో తదుపరి ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో తమకే ఆధిక్యత లభిస్తోందని వారు భావిస్తున్నారు.శరద్ పవార్ లేకపోతే ఈ చర్య ఫలించదని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.శరద్ పవార్ తనకు మద్దతివ్వకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని అజిత్ పవార్ భయపడుతున్నారు.మొత్తం మీద మహారాష్ట్ర(Maharashtra) రాజకీయం మహా రసవత్తరంగా మారింది.

Updated Date - 2023-04-18T12:02:07+05:30 IST