Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..

ABN , First Publish Date - 2023-05-03T12:08:56+05:30 IST

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? అని కోపం వచ్చినపుడు అంటూ ఉంటాం. కానీ కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా చెట్లకు కరెన్సీ కట్టలు

Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..

బెంగళూరు : డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? అని కోపం వచ్చినపుడు అంటూ ఉంటాం. కానీ కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా చెట్లకు కరెన్సీ కట్టలు పండటం కనిపిస్తోంది. అదే విధంగా ఆటో రిక్షాల్లో కూడా ధనరాశులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు అవాక్కవుతున్నారు. ఎన్నికలకు వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కర్ణాటకలోని మైసూరులో సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో సుమారు రూ.1 కోటి నగదును ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మామిడి చెట్టుపైన ఓ పెట్టెలో దాచి ఉంచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకరవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న అశోక్ కుమార్ రాయ్ సోదరుడే సుబ్రహ్మణ్య రాయ్.

ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొద్ది రోజుల నుంచి తనిఖీలను ముమ్మరం చేశారు. అదేవిధంగా బెంగళూరు పోలీసులు ఇద్దరి నుంచి రూ.1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది లెక్కల్లో చూపని సొమ్ము అని తెలిపారు. సిటీ మార్కెట్ ఏరియాలో ఉన్న ఓ ఆటో నుంచి ఏప్రిల్ 13న ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.

శాసన సభ ఎన్నికలు మే 10న జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును రవాణా చేయడానికి అనుమతి లేదు.

గత నెలలో ఆదాయపు పన్ను శాఖ అదికారులు అంకిత బిల్డర్స్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ సంస్థ యజమాని నారాయణ్ ఆచార్యకు హుబ్బళిలో ఉన్న ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ శాఖ అధికారులు అంతకుముందు మాజీ కాంగ్రెస్ నేత గంగాధర్ గౌడకు చెందిన ఇళ్లు, విద్యా సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు.

ఇవి కూడా చదవండి :

SIT : ఏపీ ప్రభుత్వ ‘సిట్‌’పై సుప్రీంకోర్టులో కీలక తీర్పు

MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు

Updated Date - 2023-05-03T12:08:56+05:30 IST