Raipur Congress plenary : ప్రియాంక గాంధీ వాద్రాకు గులాబీ పూల తివాచీతో ఘన స్వాగతం
ABN , First Publish Date - 2023-02-25T16:08:50+05:30 IST
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)కు ప్రత్యేక ప్రాధాన్యం
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఆమె కోసం ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై దట్టంగా గులాబీ పూల రేకులను తివాచీ మాదిరిగా పరిచి, స్వాగతం పలికారు. ఆమె శనివారం ఈ సమావేశాలకు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌పూర్‌లోని విమానాశ్రయం నుంచి ప్లీనరీకి వెళ్లే మార్గంలో తివాచీ మాదిరిగా గులాబీ పూల రేకులను పరిచారు. రెండు కిలోమీటర్ల పొడవున పూల తివాచీని ఏర్పాటు చేసేందుకు సుమారు 6,000 కేజీల గులాబీలను వినియోగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రంగు రంగుల దుస్తులు ధరించిన జానపద కళాకారులు నృత్యాలు చేస్తూ ఆమెకు స్వాగతం పలికారు.
ప్రియాంకకు స్వాగతం పలికినవారిలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ మోహన్ మార్కం కూడా ఉన్నారు. ప్రియాంక విలేకర్లతో మాట్లాడుతూ, తనకు ఘన స్వాగతం లభించిందని, తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Yogi Adityanath : మాఫియాను మట్టిలో కలుపుతాం : యోగి
America Vs China : భారత్ పొరుగు దేశాలకు చైనా రుణాలు... అమెరికా తీవ్ర ఆందోళన...