RSS chief : భారత దేశం మతపరమైన కర్తవ్యాలను నిర్వహిస్తోంది : మోహన్ భాగవత్
ABN , First Publish Date - 2023-04-23T15:59:29+05:30 IST
భారత దేశం మతపరమైన కర్తవ్యాలను నిర్వహించడాన్ని నమ్ముతుందని, అమెరికా, రష్యా, చైనా దేశాల మాదిరిగా నియంతృత్వ దేశంగా నిలవాలని
న్యూఢిల్లీ : భారత దేశం మతపరమైన కర్తవ్యాలను నిర్వహించడాన్ని నమ్ముతుందని, అమెరికా, రష్యా, చైనా దేశాల మాదిరిగా నియంతృత్వ దేశంగా నిలవాలని కోరుకోదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) చెప్పారు. వేద సంస్కృత జ్ఞాన గౌరవ సమారోహ్ (Ved Sanskrit Gyan Gaurav Samaroh)లో ఆయన ఆదివారం మాట్లాడారు.
ఇతరులకు సేవ చేయడాన్ని భారత దేశం నమ్ముతుందని మోహన్ భాగవత్ చెప్పారు. వేద కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటున్నందువల్ల మన దేశం ధర్మబద్ధమైన దేశంగా అభివృద్ధి చెందుతోందని, మతపరమైన కర్తవ్యాలను పాటిస్తోందని చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాలపై తమ అధికారాన్ని వినియోగిస్తాయని చెప్తూ, అందుకు ఉదాహరణ సోవియెట్ యూనియన్‌ను అమెరికా కూల్చడాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు చైనా అమెరికాపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తోందన్నారు. అమెరికా, రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌ను పావుగా వాడుకుంటున్నాయన్నారు. భారత దేశం ఎల్లప్పుడూ ఇతర దేశాలకు అవసరం అయినపుడు ఆదుకుంటోందన్నారు. మన దేశంతో ఆయా దేశాలకుగల సంబంధాలతో పని లేకుండా వాటికి సహాయపడుతోందన్నారు. ఉక్రెయిన్‌కు సహాయపడాలని మన దేశం కోరుకుంటోందన్నారు.
ప్రస్తుత మన దేశ విదేశాంగ విధానాన్ని భాగవత్ ప్రశంసించారు. గతంలో మన దేశం ఈ విధంగా తన వైఖరిని నిర్ణయించుకునేది కాదన్నారు. శ్రీలంక రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నపుడు భారత దేశం అందించిన సహాయాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారు. శ్రీలంక ఎప్పుడూ చైనా లేదా పాకిస్థాన్ వైపు ఉండేదన్నారు. తన అంతర్గత వ్యవహారాల నుంచి భారత దేశాన్ని దూరంగా ఉంచేదన్నారు. అయితే ఆ దేశం కష్టాల్లో ఉన్నపుడు కేవలం భారత దేశమే సహాయపడిందన్నారు. ఏదైనా దేశంలో ఉన్న పరిస్థితినిబట్టి ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశం మన దేశానికి ఉండదన్నారు. మన దేశం ఇప్పుడు తన మతపరమైన విశ్వాసాలతో ముందుకు వెళ్తోందని, ఇతర దేశాల పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని కోరుకోదని చెప్పారు.
టెక్నాలజీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, సైన్స్ మతాన్ని పట్టించుకోదన్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధాశక్తి (Artificial Intelligence) మానవ జాతిని కబళిస్తుందని, మనం ఉనికిలేనివారం అవుతామని భయపడుతున్నారని చెప్పారు. సైన్స్ కూడా మానవులను జీవసంబంధ జంతువులుగా పరిగణిస్తుందని, కానీ మతాన్ని పరిగణనలోకి తీసుకోదని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Satyapal Malik VS Amit shah: సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన అమిత్‌షా
Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్