Namo Jersey: మోదీకి సచిన్ టెండూల్కర్ స్పెషల్ గిఫ్ట్

ABN , First Publish Date - 2023-09-23T16:56:37+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. 'నమో' నెంబర్ 1 పేరున్న ప్రత్యేక టీమిండియా జెర్సీని అందజేశారు.

Namo Jersey:  మోదీకి సచిన్ టెండూల్కర్ స్పెషల్ గిఫ్ట్

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రత్యేక బహుమతి (Special Gift) ఇచ్చారు. 'నమో' (Namo) నెంబర్ 1 పేరున్న ప్రత్యేక టీమిండియా జెర్సీని (Special team India Jersey) అందజేశారు. టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి సమక్షంలో ఈ గిఫ్ట్ అందించారు. మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శనివారంనాడు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ ప్రత్యేక కానుకను ప్రధాని అందుకున్నారు.


వారణాసిలోని గంజారి ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణం జరుగనుంది. స్టేడియం నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు కాగలవని అంచనా. ఇందుకోసం బీసీసీఐ రూ.331 కోట్లు ఖర్చు చేయనుండగా, స్థల సేకరణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ.121 కోట్లు ఖర్చు చేసింది.

Updated Date - 2023-09-23T16:57:46+05:30 IST