Sharad pawar: శ్రేయోభిలాషులైతే ఆమాట అంటున్నారు...కానీ..?
ABN , First Publish Date - 2023-08-13T21:09:58+05:30 IST
భారతీయ జనతా పార్టీతో పొత్తు ) విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టత ఇచ్చారు. కొంతమంది శ్రేయాభిలాషులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తు్న్నారని, అయితే బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేది లేదని తెలిపారు.
ముంబై: భారతీయ జనతా పార్టీ (BJP)తో పొత్తు (Alliance) విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పష్టత ఇచ్చారు. కొంతమంది శ్రేయాభిలాషులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తు్న్నారని, అయితే బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేది లేదని తెలిపారు. శరద్ పవార్, ఇటీవలే ఎన్‌సీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ శనివారంనాడు సమావేశం కావడంపై ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సీనియర్ పవార్ తాజా వివరణ ఇచ్చారు.
ఎన్‌సీపీ రాజకీయ సిద్ధాంతాలకు బీజేపీతో పొత్తు సరిపడదని షోలాపూర్ జిల్లా సాంగోలాలో ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడుగా తాను చాలా స్పష్టంగా ఈ విషయం చెబుతున్నానని, బీజేపీతో కలిసి పనిచేయడం ఉండదని అన్నారు. ''మాలో కొందరు (అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ) వేరే నిర్ణయం తీసుకున్నారు. ఆ కారణంగానే వారు తనతో సుహృద్భావ చర్చలు జరుపుతున్నారు'' అని నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ఆయన చెప్పారు. పుణెలో అజిత్ పవార్‌తో 'రహస్య' సమావేశంపై అడిగినప్పుడు, అజిత్ తన మేనల్లుడని, అతన్ని కలవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఒక కుటుంబంలోని సీనియర్ సభ్యుడు మరో సభ్యుడిని కలిస్తే అదేమెంత పెద్ద విషయం అవుతుందని అన్నారు.