DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేసులో సుప్రీంలో సీబీఐకి చుక్కెదురు

ABN , First Publish Date - 2023-07-31T14:59:20+05:30 IST

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka Deputy Chief Minister DK Shivakumar) కేసు విషయంలో సుప్రీం కోర్టులో(Supreme Court) సీబీఐకి(CBI) చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

 DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేసులో సుప్రీంలో సీబీఐకి చుక్కెదురు

ఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka Deputy Chief Minister DK Shivakumar) కేసు విషయంలో సుప్రీం కోర్టులో(Supreme Court) సీబీఐకి(CBI) చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అవినీతి కేసులో డీకే శివకుమార్‌పై విచారణను నిలిపివేస్తూ ఫిబ్రవరి 10న కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. అయితే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై(High Court's stay) జోక్యం చేసుకోవడం కుదరదని సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైకోర్టు డివిజన్ బెంచ్ శివకుమార్‌ విచారణపై మధ్యంతర స్టే ఇచ్చిందని తెలిపారు. శివకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిందని, అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించిందని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకోబోదని, కాకపోతే కేసును త్వరగా పరిష్కరించాలని హైకోర్టును అభ్యర్థించడానికి సీబీఐకి స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు.


కాగా ఫిబ్రవరి 10న శివకుమార్‌పై అవినీతి కేసులో సీబీఐ విచారణ జరపడకుండా కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసులో ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. శివకుమార్‌పై నమోదైన కేసులు 2020 నాటివని హైకోర్టు ఎత్తిచూపింది. గత రెండేళ్లుగా దర్యాప్తు పురోగతిపై కూడా సీబీఐని ప్రశ్నించింది. అలాగే తుది నివేదికను ఎప్పుడు దాఖలు చేస్తారని సీబీఐని హైకోర్టు అడిగింది. 2017లో ఆదాయపు పన్ను శాఖ డీకే శివకుమార్‌పై దాడులు చేసింది. ఐటీ శాఖ అందించిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అతనిపై విచారణ ప్రారంభించింది.

Updated Date - 2023-07-31T15:00:18+05:30 IST