Abhishek Banerjee: ఆ ఒక్కటి చేయండి... రాజకీయాలనుంచే తప్పుకుంటా..

ABN , First Publish Date - 2023-04-14T22:42:52+05:30 IST

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ షాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Abhishek Banerjee: ఆ ఒక్కటి చేయండి... రాజకీయాలనుంచే తప్పుకుంటా..
TMC leader Abhishek Banerjee strong reply to Amit Shah

కోల్‌కతా: మేనల్లుడు అభిషేక్ బెనర్జీని (Abhishek Banerjee) తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలన్నదే మమత బెనర్జీ (Mamatha Banerjee) లక్ష్యమని బెంగాల్ (West Bengal) పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ఆరోపణలపై తృణమూల్ తీవ్రంగా స్పందించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ షాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌కు ఇవ్వాల్సిన 1.15 లక్షల కోట్ల బకాయిలు చెల్లిస్తే తానే రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పారు.

అంతకు ముందు బీర్‌భూమ్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ‘‘మమత దీదీ, మీరు మీ తర్వాత మీ మేనల్లుడు ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటుండవచ్చు. కానీ బీర్‌భూమ్ గడ్డపై నుంచి నేను చెప్తున్నాను, తదుపరి ముఖ్యమంత్రి బీజేపీ నుంచి వస్తారు. దీనికి ట్రైలర్ 2024లో కనిపిస్తుంది’’ అన్నారు. రాష్ట్రంలో శ్రీరామ నవమి (Sri Ram Navami) శోభాయాత్రలను జరుపుకోకూడదా? శోభాయాత్రలపై దాడులు చేస్తారా? అని షా ప్రశ్నించారు. ఈ దారుణానికి కారణం ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటైతే, శ్రీరామ నవమి శోభాయాత్రలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదన్నారు. మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు పాల్పడుతున్న నేరాలకు వ్యతిరేకంగా పోరాడగలిగేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. 35 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే, 2025లో జరిగే శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 35 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రజలు శ్రీరామ నవమి శోభాయాత్రలు ప్రశాంతంగా చేసుకునేలా చర్యలు తీసుకుంటామని షా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో రెండు రోజుల పర్యటనలో భాగంగా షా దక్షిణేశ్వర్‌లోని కాళికామాతను దర్శించుకున్నారు.

Updated Date - 2023-04-14T22:43:58+05:30 IST