Train: తెలుగు రాష్ట్రాల మీదుగా.. నవంబరు 9న ‘దివాలి గంగా స్నాన యాత్ర’ రైలు

ABN , First Publish Date - 2023-08-02T08:18:58+05:30 IST

దీపావళి పండుగ(Diwali festival)ను పురస్కరించుకుని నవంబరు 9వ తేదీన ‘దివాలి గంగా స్నాన యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలు నడవనుంది. ఈ భారత్‌ గౌర

Train: తెలుగు రాష్ట్రాల మీదుగా.. నవంబరు 9న ‘దివాలి గంగా స్నాన యాత్ర’ రైలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ(Diwali festival)ను పురస్కరించుకుని నవంబరు 9వ తేదీన ‘దివాలి గంగా స్నాన యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలు నడవనుంది. ఈ భారత్‌ గౌరవ ట్రైన్‌ (ఎస్‌జడ్‌బీజీ09) నవంబరు 9న ఉదయం 3.50 గంటలకు తెన్‌కాశిలో బయలుదేరి, అదే నెల 11వ తేదీ రాత్రి 10.30 గంటలకు వారణాసి చేరుకుంటుంది. తిరిగి అదే రైలు ఆ నెల 13వ తేదీన రాత్రి 11 గంటలకు వారణాసిలో బయలుదేరి 17వ తేదీన రాత్రి 7.25 గంటలకు తెన్‌కాశి చేరుకుంటుంది. 3 ఏసీ త్రీ టైర్‌, 8 స్లీపర్‌, 1 ప్యాంట్రీ కార్‌, 2 పవర్‌ కార్స్‌ కలిగిన ఈ రైలు రాజపాళయం, శివకాశి, విరుదునగర్‌, మదురై, దిండుగల్‌, తిరుచ్చి, తంజావూర్‌, కుంభకోణం మైలాడుదురై, చిదంబరం, త్రిపాద్రిపులియూర్‌, విల్లుపురం, చెంగల్పట్టు, ఎగ్మూర్‌, గూడూరు, విజయవాడ, వరంగల్‌(Gudur, Vijayawada, Warangal), బల్హార్షా, జబల్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ సంఘం మీదుగా వారణాసి(Varanasi) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు గయ, రాంచి, రూర్కేలా, ఝార్సుగుడ, సంభల్‌పూర్‌, టీట్లాగర్హ, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, ఎగ్మూర్‌, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, త్రిపాద్రిపులియూర్‌, చిదంబరం, మైలాడుదురై, కుంభకోణం, తంజావూర్‌, తిరుచ్చి, కారైక్కుడి, మండపం, మదురై, విరుదునగర్‌, శివకాశి, రాజపాళయం మీదుగా తెన్‌కాశి చేరుకుంటుంది.

Updated Date - 2023-08-02T08:18:58+05:30 IST