Vande Bharat train: రెండు రాజధానుల మధ్య ‘వందేభారత్’ రైలు
ABN , First Publish Date - 2023-11-21T11:08:50+05:30 IST
బెంగళూరు - చెన్నై(Bangalore - Chennai) నగరాల మధ్య మరో వందేభారత్ రైలు సోమవారం ప్రారంభమయింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు - చెన్నై(Bangalore - Chennai) నగరాల మధ్య మరో వందేభారత్ రైలు సోమవారం ప్రారంభమయింది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ (ఎస్‌ఎంటీ) నుంచి చెన్నై సెంట్రల్(Chennai Central) వరకు ఈ రైలు ప్రయాణించింది. ఎస్‌ఎంవీటీ నుంచి సాయంత్రం 5.15 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంది. 8 బోగీలతో ఈ ప్రత్యేక రైలును రాత్రివేళల్లో ప్రయాణించే వారికోసం ఉద్దేశించారు. తిరిగి చెన్నైసెంట్రల్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు ఎస్‌ఎంవీటీ స్టేషన్‌కు చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రకటించింది.