Assembly Bypolls: కర్ణాటకతోపాటు మరో 4 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్.. ఎక్కడెక్కడంటే..
ABN , First Publish Date - 2023-05-10T09:01:10+05:30 IST
దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్‌సభ స్థానంతోపాటు ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయలలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బుధవారం ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది....
న్యూఢిల్లీ: దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్‌సభ స్థానంతోపాటు ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయలలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బుధవారం ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.(Assembly Bypolls) పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్‌సభ స్థానం(Jalandhar Lok Sabha constituency), ఉత్తరప్రదేశ్‌లోని స్వర్, ఛన్‌బే అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని జార్సుగూడ, మేఘాలయలోని సోహియాంగ్ అసెంబ్లీ స్థానాల్లో బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది.(UP, Odisha, Meghalaya)ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 13వతేదీన జరగనుంది.సోహియాంగ్ యూడీపీ అభ్యర్థి లంగ్ దోహ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది.జలంధర్ లోక్ సభ స్థానం నుంచి నేరచరిత్ర ఉన్న ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ సీఈఓ చెప్పారు. జలంధర్ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. సాయుధ పోలీసుల పహరా మధ్య ప్రశాంతంగా ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది.