Kuwait: ఈ ఏడాది మొదటి త్రైమాసికం నాటికే 18,898 మందిపై ట్రావెల్ బ్యాన్!
ABN , First Publish Date - 2023-04-27T13:15:31+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait).. ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు పౌరులు, ప్రవాసులు కలిపి మొత్తం 18,898 మందిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait).. ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు పౌరులు, ప్రవాసులు కలిపి మొత్తం 18,898 మందిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించింది. ఈ మేరకు తాజాగా విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. ఫర్వానియా ఎగ్జిక్యూషన్ డిపార్ట్‌మెంట్ అత్యధికంగా 4,895 మందిపై ప్రయాణించకుండా నిషేధించింది. ఆ తర్వాత అహ్మదీ (3,658), జహ్రా (3,086), హవలీ (3,004), రాజధాని కువైత్ సిటీ (2,784), ముబారక్ అల్-కబీర్ (1,471) మందిపై దేశం నుంచి బయటకు ప్రయాణించకుండా నిషేధించాయి. ఇక నివేదిక ప్రకారం ఈ కేసుల్లో చాలా వరకు వివాహ ఖర్చులు (Marital Expenses), ట్రాఫిక్ ఉల్లంఘనలకి (Traffic violations) సంబంధించినవి ఉన్నాయి.