NRI: డిఫెన్స్ రహస్యాలు లీక్ కేసు.. సీబీఐ అదుపులో కెనడాకు చెందిన ఎన్నారై..!

ABN , First Publish Date - 2023-08-23T10:50:48+05:30 IST

కెనడాకు చెందిన ఎన్నారై రాహుల్ గంగల్ (Rahul Gangal) ను డిఫెన్స్ రహస్యాలు లీక్ చేస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation) అదుపులోకి తీసుకుంది.

NRI: డిఫెన్స్ రహస్యాలు లీక్ కేసు.. సీబీఐ అదుపులో కెనడాకు చెందిన ఎన్నారై..!

NRI: కెనడాకు చెందిన ఎన్నారై రాహుల్ గంగల్ (Rahul Gangal) ను డిఫెన్స్ రహస్యాలు లీక్ చేస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation) అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఢిల్లీలో రాహుల్ గంగల్‌ను అరెస్టు చేయడానికి ముందు కొన్ని నెలలుగా సీబీఐ (CBI) అతనిపై నిఘా పెట్టింది. కెనడా (Canada) లో పర్మినెంట్ రెసిడెన్సీ పర్మిషన్ పొందిన అతను గతవారం స్వదేశానికి వచ్చాడు. వృత్తిరీత్యా ఒక వ్యాపారి. అయితే, రాహుల్ భారత్‌కు రాగానే సీబీఐ అధికారులు అతని కదలికలపై నిఘా పెట్టింది. ఢిల్లీలో ఎక్కడెక్కడ తిరిగింది అంతా కూడా సీబీఐ పసిగట్టింది. అనంతరం అతను ఉంటున్న స్థలాలలో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో గూఢచర్యం కేసు (Case of Espionage) లో అతని ప్రమేయం తాలూకు డాక్యుమెంట్స్, డిజిటల్ పరికరాలు సీబీఐ అధికారులకు దొరికాయి. ఇతర పలు కీలక రహస్య పత్రాలు కూడా అధికారుల తనిఖీలలో బయటపడ్డాయి. వాటిని ఈ కేసులో నిందితుడైన జర్నలిస్ట్ వివేక్ రఘువంశీ (Vivek Raghuvamsi) తో రాహుల్ పంచుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. అతడిని ఢిల్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచుతారని తెలిసింది. దీనికి ముందు ఇదే కేసు విషయమై మే 17వ తారీఖుున జర్నలిస్టు వివేక్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

నిందితుడు రాహుల్ ఇండియన్ డిఫెన్స్ ప్రాజెక్టుల గురించి రహస్య సమాచారాన్ని సేకరించి, దాన్ని విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల (Foreign Intelligence Agencies) తో పంచుకుంటున్నాడనే ఆరోపణలతో సీబీఐ గతేడాది డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ కేసును పరిశీలిస్తోంది. స్నేహపూర్వక దేశాలతో భారత్ జరిపిన వ్యక్తిగత సంభాషణల వివరాలు కూడా రాహుల్ వద్ద ఉండడం చూసి అధికారులు షాక్ అయ్యారు. గత తనిఖీల్లో భారత రక్షణకు (Defense Secrets) సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సీబీఐ గుర్తించింది. అలాగే రాహుల్ ఆన్‌లైన్ ఖాతాలు, ఇ-మెయిల్స్ నుంచి కూడా సీబీఐ మరికొంత డేటాను రికవరీ చేయడం జరిగింది.

NRI: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి వ్యక్తి


Updated Date - 2023-08-23T10:50:48+05:30 IST