Number plate Auction: బాప్‌రే బాప్.. దుబాయ్‌లో ఓ ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ ఎంత పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ABN , First Publish Date - 2023-09-06T11:45:23+05:30 IST

ప్రస్తుతం మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల (Fancy Number Plate) కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులు ఎలాగో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం పోటీ పడలేరు. కానీ, సంపన్నులు ఆ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత వెచ్చించడానికైనా వెనకాడరు.

Number plate Auction: బాప్‌రే బాప్.. దుబాయ్‌లో ఓ ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ ఎంత పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

దుబాయ్: ప్రస్తుతం మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల (Fancy Number Plate) కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులు ఎలాగో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం పోటీ పడలేరు. కానీ, సంపన్నులు ఆ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత వెచ్చించడానికైనా వెనకాడరు. ఇలా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌కు భారీ డిమాండ్ ఏర్పడిన తరుణంలో కొన్నిసార్లు అవి పలికే ధర తెలిసి నోరెళ్లబెట్టడం మన వంతు అవుతుంది. ఇక ఇలాంటి ఫ్యాన్సీ వెహికల్ లైసెన్స్ ప్లేట్ల కోసం ఆర్‌టీఏ (RTA) వారు వేలం (Auction) నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అలా వేలంలో భారీ మొత్తం పాడిన వారికి ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ దక్కుతుంది.

కాగా, తాజాగా ఇలాంటి వేలంపాట ఒకటి దుబాయ్‌ (Dubai) లో జరిగింది. ఈ వేలం పాటలో ఓ ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ పలికిన ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ నెంబర్ ప్లేట్ పలికిన ధర తెలిసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ నంబర్ ఏంటో చెప్పలేదు కదూ. 'ఏఏ 70' (AA 70). ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం అక్కడ ఓ వ్యక్తి వేలు కాదు లక్షలు కాదు కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశాడు. ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం అతగాడు 3.82 మిలియన్ దిర్హమ్స్ వెచ్చించాడు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 8.62కోట్లు. ఇక ఇదే వేలంపాటలో మరికొన్ని నంబర్ సిరీస్‌లు కూడా భారీ ధరలనే దక్కించుకోవడం గమనార్హం.

UAE: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. యూఏఈలో ఆ తప్పుకు రూ.2కోట్లకు పైగానే జరిమానా..!

Updated Date - 2023-09-06T11:51:43+05:30 IST