US: 9నెలల క్రితమే అమెరికా వెళ్లిన హైదరాబాదీ.. అంతలోనే ఊహించని విషాదం..!

ABN , First Publish Date - 2023-10-04T10:33:05+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ముస్తఫా షరీఫ్‌ (Mohammed Mustafa Shareef) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు.

US: 9నెలల క్రితమే అమెరికా వెళ్లిన హైదరాబాదీ.. అంతలోనే ఊహించని విషాదం..!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ముస్తఫా షరీఫ్‌ (Mohammed Mustafa Shareef) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పినెల్లాస్‌ పార్క్‌ (Pinellas Park) లో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ముస్తఫా షరీఫ్.. కస్టమర్‌కు ఫుడ్ పార్శిల్ ఇచ్చి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌ (Swimming pool) లోకి జారిపడి మృతి చెందినట్లు అమెరికా అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌కు చెందిన ముస్తఫా షరీఫ్ తొమ్మిది నెలల క్రితమే యూఎస్ వెళ్లాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు చనిపోయాడనే వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అతని మృతితో స్వస్థలం మల్లాపూర్‌లో విషాదం అలుముకుంది. కాగా, వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని, అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ (Indian Consulate) ను సహాయం అందించాల్సిందిగా ముస్తఫా షరీఫ్ ఫ్యామిలీ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ (External Affairs Minister S. Jaishankar) ను అభ్యర్థించింది. మృతుడి తల్లిదండ్రులు, అత్తమామలకు అంత్యక్రియలకు హాజరు కావడానికి అత్యవసర వీసాలు మంజూరు చేయాలని ఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయం, అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్‌ను కోరాలని వారు మంత్రిని అభ్యర్థించారు.

Kuwait: అన్నంత పని చేస్తున్న కువైత్.. 800 మంది ప్రవాసులు సర్వీస్ నుంచి తొలగింపు!


Updated Date - 2023-10-04T10:33:29+05:30 IST