Indian: కువైత్‌లో భారత ప్రవాసుడు అరెస్ట్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..!
ABN , First Publish Date - 2023-09-23T08:10:46+05:30 IST
కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
కువైత్ సిటీ: కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేగాక 1 మిలియన్ దినార్లు (రూ.26.89కోట్లు) మోసానికి కూడా పాల్పడినట్లు తేల్చారు. అలాగే అతని రెసిడెన్సీ స్టేటస్ (Residency Status) గడువు కూడా తొమ్మిదేళ్ల క్రితమే ముగిసినట్లు గుర్తించారు. అప్పటి నుంచి అతడు దేశంలో అక్రమంగానే ఉంటున్నట్లు తెలిసింది.
ఇక తాజాగా సభా అల్-నస్సేర్ (Sabah Al-Nasser) ప్రాంతంలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కువైత్ పోలీసులు అతని కోసం వెళ్లిన సందర్భంలో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులు మాటువేసి మరి అతణ్ని అరెస్ట్ చేసి, అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులకు అప్పగించారు. కాగా, భారత ప్రవాసుడి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.