NRI TDP UK: లండన్ వేదికగా ఎన్నికల సన్నాహక సమావేశం

ABN , First Publish Date - 2023-07-29T12:52:24+05:30 IST

ఎన్నారై టీడీపీ యూకే కౌన్సిల్ (NRI TDP UK Council) ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటంలో ఎన్నారైల (NRI) పాత్ర మీద లండన్ వేదికగా జరిగిన మేధోమధన సదస్సు జరిగింది.

NRI TDP UK: లండన్ వేదికగా ఎన్నికల సన్నాహక సమావేశం

లండన్: ఎన్నారై టీడీపీ యూకే కౌన్సిల్ (NRI TDP UK Council) ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటంలో ఎన్నారైల (NRI) పాత్ర మీద లండన్ వేదికగా జరిగిన మేధోమధన సదస్సు జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి యూకే (UK) వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీడీపీ (NRI TDP) కార్యవర్గ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై టీడీపీ విభాగం అధిపతి రవి వేమూరు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (Power Point Presentation) విశేషంగా ఆకట్టుకుంది. UK/Europe వ్యాప్తంగా ఎన్నారై టీడీపీని బలోపేతం చేయటం, ఇక్కడి ఎన్నారై సేవలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎలా వినియోగించుకోబోతుందనే విషయాలను వివరించారు. అలాగే పార్టీలో ఎన్నారైల పాత్రతో పాటు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలకి భాగస్వామ్యం, పార్టీ సభ్యత్వ నమోదులోనూ ఎన్నారై టీడీపీ ఏ విధంగా పార్టీకి అదనపు బలంగ నిలుస్తుందో వివరిస్తూ జరిగిన ప్రెజెంటేషన్ ఎన్నారైలలో మరింత ఉత్సుకత పెంచింది.

TDP.jpg

తెలుగుదేశం పార్టీకి ఎన్నారైలకి అవినాభావ సమబంధం ఉందని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎన్నారైలకి పెద్దపీట వేయటంతో పాటుగా పార్టీ మేనిఫెస్టోలో ఎన్నారైల హక్కులు, వాళ్ల ఆస్తుల సంరక్షణకి అవసరమైన ప్రణాళికలు పొందుపరుస్తున్నామని సమావేశంలో పేర్కొనడం జరిగింది. దేశ జీడీపీ (GDP) లో Forex Reserves పాత్ర, అందులో ఎన్నారైల రెమిటెన్స్‌లదే (Remittance) అగ్రభాగం అని తెలిపారు. దానిని మరింత సరళీకృతం చేసేలా, ఎన్నారైల చట్టాలకు మరింత పదును పెట్టేలా కృషి చేస్తామని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ కార్యకర్తలు గ్రామాస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకత్వంతో అనుసంధనమవుతూ పార్టీ ప్రచార కార్యక్రమాన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని తీర్మానించారు. ఓటు హక్కు విశిష్టత విషయమై యువతలో చైతన్యం తెస్తూ, ప్రతి అభిమానిని పోలింగ్ బూతు వైపుగా నడపటంలో పోషించాల్సిన పాత్ర మీద చర్చించటం జరిగింది.

TDPP.jpg

అన్నగారి ఆశయాల సాధన కోసం, చంద్రన్న నాయకత్వాన్ని బలోపేతం చేయటం కోసం యువగళం ద్వారా నారా లోకేష్ ప్రజల్లో తెస్తున్న చైతన్యం, పార్టీకి వస్తున్న ఆదరణని సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సమావేశం నిర్ణయించింది. ఎన్నారై టీడీపీ యూకే అధ్యక్షుడు వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గుంటుపల్లి రామారావు, యూకే టీడీపీ కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి జయకుమార్, ప్రసన్న నాదెండ్ల, చక్రి మొవ్వ, శ్రీకిరణ్ పరుచూరి, పాలడుగు శ్రీనివాస్, నరేష్ మలినేని, నవీన్ జవ్వాడి, అమర్ మన్నే, రామకృష్ణ రిమ్మలపూడి, శివరాం కూరపాటి, అనిల్ పచ్చా, శ్రీధర్ నారా, శ్రీపతి సరిపూటి, నాగ్ దివి, వినయ్ కామినేని, రవికాంత్ కోనేరు, శ్రీధర్ బెల్లం, యూకే తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-29T12:52:24+05:30 IST