Nandyal Politics : చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ, పోటీపై భూమా జగత్ విఖ్యాత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-03T21:20:45+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుతో (TDP Chief Chandrababu) టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) దంపతుల భేటీ టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States) పెద్ద చర్చనీయాంశమే అయ్యింది..

Nandyal Politics : చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ, పోటీపై భూమా జగత్ విఖ్యాత్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుతో (TDP Chief Chandrababu) టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) దంపతుల భేటీ టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States) పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఈ భేటీ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు మనోజ్ ప్రకటించడంతో ఇది మరింత చర్చకు దారితీసింది. భూమా మౌనికా రెడ్డి అరంగేట్రం పక్కా అని.. నంద్యాల నుంచి పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ కావడం, ఇప్పటి వరకూ ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియను (Bhuma Akhila Priya), నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి (Bhuma Bramhananda Reddy) గెలుపులో కీలక పాత్ర పోషించడం.. ఇవన్నీ చూసిన తర్వాత అభిమానులు మౌనికను (Bhuma Mounika Reddy) రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతున్నారు. పైగా మౌనిక కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తుండటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీచేస్తారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో ఈ భేటీపై మౌనికారెడ్డి సోదరుడు, టీడీపీ యువనాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి (Bhuma Vikhyath Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


CBN-Manoj.jpg

ఇదీ అసలు కథ..?

భూమా శోభానాగిరెడ్డి, నాగిరెడ్డి (Bhuma Shobha Nagireddy, Nagireddy) మరణాంతరం ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే బరిలోకి దిగాల్సిందేనని నంద్యాలలో విస్తృత్యంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలతో వరుస సమావేశాలవుతున్నారు. ఇక్కడ్నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని స్వయంగా జగత్ ప్రకటించారు కూడా. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన యువనేత.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం, ఇటీవల చంద్రబాబుతో మనోజ్, మౌనిక భేటీ కావడంపై, నంద్యాల నుంచి మౌనిక లేదా బ్రహ్మానందరెడ్డి పోటీచేస్తారన్న వార్తలపై విఖ్యాత్ రెడ్డి స్పందించారు. భూమా ఫ్యామిలీ అంతా ఒకటే. మేమంతా ఒక్కటిగా ఉన్నాం. మంచు మనోజ్, మౌనిక మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశారు. నంద్యాల ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నేను ఉన్నాను. నంద్యాల టికెట్ కోసం టీడీపీలోనే కాదు.. వైసీపీలో కూడా టికెట్ కోసం పోటీ ఉంది. వైసీపీ నుంచి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డా. శాంతి రాముడు, ఇషాక్ భాష రేసులో ఉన్నారుఅని విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు.

Jagath-And-Lokesh.jpg

అవును పోటీచేస్తున్నా!

నంద్యాల (Nandyal) నుంచి విఖ్యాత్ పోటీచేస్తారని.. బ్రహ్మానందరెడ్డిని పక్కనెట్టేస్తారని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నంద్యాలలో విఖ్యాత్ పర్యటించడం, వరుసగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ తరఫున ఇవన్నీ చేయడానికి వీల్లేదని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలపై కూడా యువనేత స్పందించారు. భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డపైనే ఫోకస్ పెట్టమని పార్టీ అధిష్టానం చెప్పింది. నా తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుంచే నేను పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తాను. నన్ను నంద్యాలలో తిరగవద్దని పార్టీ చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమే. నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామంలో పర్యటిస్తాను. నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతాను. నేను మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఎవరికి సత్తా ఉంటుందో.. ఎవరు కార్యకర్తలకు భరోసా ఇస్తారో వారికే టికెట్ వస్తుందనే నమ్మకం ఉందని గతంలోనే వ్యాఖ్యానించారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానుఅని జగత్ విఖ్యాత్ చెప్పుకొచ్చారు.

bhuma-vikhyatreddy.jpg

మరోవైపు.. బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాల నియోజకవర్గంలో మునుపటిలా యాక్టివ్‌గా లేరు. దీంతో విఖ్యాత్ రంగంలోకి దిగిపోయారు. మరో ఇద్దరు కూడా టికెట్ గట్టి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ ముగ్గురు మధ్యే టికెట్ పంచాయితీ నడుస్తోందన్న మాట. మరోవైపు.. భూమా మౌనికా రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇటీవల చంద్రబాబుతో భేటీ కావడంతో కదనరంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు టికెట్లు ఆశిస్తున్నారన్న మాట. ఫైనల్‌గా చంద్రబాబు మనసులో ఏముందో..? ఎవరికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపుతారో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే..!

Bhuma-Jagath.jpg


ఇవి కూడా చదవండి


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!



Updated Date - 2023-08-03T21:25:42+05:30 IST