Delhi Liquor Scam : విచారణలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలివేనా.. నరాలు తెగే ఉత్కంఠ..!

ABN , First Publish Date - 2023-03-09T18:38:01+05:30 IST

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎప్పుడేం జరుగుతుందో ఊహకందని విషయం. ఎవరికెప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారో..

Delhi Liquor Scam : విచారణలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలివేనా.. నరాలు తెగే ఉత్కంఠ..!

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎప్పుడేం జరుగుతుందో ఊహకందని విషయం. ఎవరికెప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారో.. ఎవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అర్థం కాని విషయం. లిక్కర్ పాలసీ (Liquor Policy) మొదలుకుని.. స్కామ్‌ వరకూ ఎవరెవరు ఇందులో పాత్రదారులు.. సూత్రదారులెవరు..? అని తేల్చే పనిలో ఈడీ, సీబీఐ (ED, CBI) దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలువురికి నోటీసులు, విచారణ తర్వాత అరెస్ట్ చేసిన ఈడీ, సీబీఐ.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన కవిత.. తొలుత మరింత గడువు కావాలని కోరినప్పటికీ ఈనెల 11న ఈడీ విచారణకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు కవిత లేఖ రాశారు. దీంతో.. మార్చి 11న కవితపై ఈడీ (Enforcement Directorate) ఏఏ ప్రశ్నలను సంధించబోతోంది..? ఆ ప్రశ్నలకు కవిత (MLC Kavitha) ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు..? అనేదానిపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) శ్రేణుల్లో నరాలు తెగే రేంజ్‌లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుదీర్ఘ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్‌లో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అయితే.. విచారణలో కవితను ఈడీ అధికారులు ఏమేం ప్రశ్నలు అడగొచ్చు..? అనే విషయాలు ఇప్పుడీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

కవితను ఈ ప్రశ్నలు అడుగుతారా..!?

1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?

2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో (Manish Sisodia) పరిచయం ఎలా ఏర్పడింది..!?

3. ఢిల్లీ గవర్నమెంట్‌కు (Delhi Govt)- సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?

4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?

5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?

6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?

7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?

8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?

9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?

10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?

11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?

12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?

13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?

14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?

15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?

16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?

17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?

18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?

19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?

20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..?

విచారణ తర్వాత ఏం జరుగుతుంది..!? అనే ప్రశ్నలు ఈడీ అడిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. కవితను సుదీర్ఘంగా విచారించిన తర్వాత అదే రోజు లేదా మరుసటి రోజు.. అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai), కవితను విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఇద్దరి విచారణ తర్వాత మొదట కవిత- మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (Gorantla Buchi babu).. వారి స్టేట్మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారని సమాచారం. అనంతరం ఈ ముగ్గురు చెప్పిన విషయాలన్ని సరిపోల్చి.. ఆ తర్వాత ముగ్గుర్నీ కలిపి విచారించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు.. కవితను అరెస్ట్ చేస్తే తర్వాత ఏం చేయాలి..? అనేదానిపై బీఆర్ఎస్ పెద్దలు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం. కేంద్రం కక్ష్యసాధింపు చర్యలు చేపడుతోందని.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ భావిస్తోందట. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేయడంతో పాటు ఇంకా ఏమేం చేయొచ్చు..? ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఏం చేయొచ్చు..? అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చింది. ఎల్లుండి ఏం జరుగుతుందో ఏంటో వేచి చూడాలి మరి.

******************************

ఇది కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam : ఢిల్లీ బయల్దేరేముందు కేసీఆర్-కవిత 15 నిమిషాల ఫోన్‌కాల్‌లో ఏమేం మాట్లాడుకున్నారు..!?

******************************

Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!


******************************

Delhi Liquor Scam : ఈడీ నుంచి రాని రిప్లై.. కేసీఆర్ ఫోన్ కాల్ తర్వాత ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్‌లో నరాలు తెగే ఉత్కంఠ!

******************************

Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని తేలితే.. బీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యే విషయాలు చెప్పిన న్యాయ నిపుణులు..!


******************************


Updated Date - 2023-03-09T19:49:40+05:30 IST