Telugudesam : ఫిబ్రవరి16న టీడీపీలో చేరనున్న కీలక వ్యక్తి.. పెద్ద బాధ్యతలు అప్పగించనున్న చంద్రబాబు..
ABN , First Publish Date - 2023-02-09T19:38:21+05:30 IST
ఏపీలో ఎలక్షన్ హీట్ (AP Election Heat) అప్పుడే మొదలైపోయింది. 2024లో ఎన్నికలు (2024 Elections) జరగాల్సి ఉండగా రేపో.. మాపో జరిగిపోతున్నాయ్ అన్నట్లుగా పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయ్..
ఏపీలో ఎలక్షన్ హీట్ (AP Election Heat) అప్పుడే మొదలైపోయింది. 2024లో ఎన్నికలు (2024 Elections) జరగాల్సి ఉండగా రేపో.. మాపో జరిగిపోతున్నాయ్ అన్నట్లుగా పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయ్. మరోవైపు అదిగో.. అధికార వైసీపీ ముందస్తు ఎన్నికలు వెళ్తోందని ప్రతిపక్షాలు మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచి.. ప్రతిపక్షంలోకి.. ప్రతిపక్షం నుంచి అధికార వైసీపీలోకి నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వైసీపీకి (YSRCP) వ్యతిరేకంగా కాగా.. మరికొందరు ముఖ్యనేతలు, ద్వితియ శ్రేణి నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే వారంతా దాదాపు టీడీపీ వైపే చూస్తున్నట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఓ కీలక వ్యక్తి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన చేరిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమిటా కీలక బాధ్యతలు అనేదానిపై కథనం.
ఇదిగో ఈయనే..
మహాసేన పేరుతో పార్టీ స్థాపించిన రాజేష్ (Mahasena Rajesh).. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు మారారు. జర్నలిస్టుగా, వ్యాఖ్యతగా ఈయనకు మంచి పేరుంది. మహాసేన జర్నలిస్టుగా (Journalist) ఏపీ ప్రజలకు బాగా సుపరిచితం అయ్యారు. కొన్నిరోజులు మహాసేన పార్టీ తరఫున జై భీమ్ (Jai Bheem) అంటూ గోదావరి జిల్లా్ల్లో తిరిగారు. ‘మార్పు కావాలి అంటే.. మహాసేన రావాలి’ అంటూ జనాల్లో తిరిగారాయన. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) సమక్షంలో వైసీపీలో చేరడం పార్టీతో విబేధాలు రావడంతో బయటికొచ్చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) ప్రశంసలు కురిపిస్తూ పార్టీకి దగ్గరయ్యారు. ఆ మధ్య జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫామ్ అయ్యిందని వార్తలు వినిపించాయి. ఏం జరిగిందో తెలియదు కానీ.. జనసేనతో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అప్పట్నుంచీ యథావిధిగా తన యూట్యూబ్ (Youtube Channel) ఛానెల్‌లో లైవ్ షోలు నడుపుకుంటున్నారు. వాస్తవానికి ఈయన విమర్శించని నేతలు, రాజకీయ పార్టీలు లేవు. ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు.. ప్రతిపార్టీలోని ఎమ్మె్ల్యేలను విమర్శించారు రాజేష్. అటు తిరిగి.. ఇటు తిరిగి ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీలోకి ఇలా..
గురువారం నాడు మాజీ సీఎం చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని రాజేష్ కలిశారు. సుమారు అరగంటపాటు భేటీ తర్వాత ఈనెల 16న టీడీపీలో చేరాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. 16న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సమక్షంలో రాజేష్ టీడీపీలో చేరబోతున్నారు. అయితే ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించాలని హైమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. టీడీపీ సోషల్ మీడియా, ఇతర బాధ్యతలను అప్పగించేందుకు అధిష్టానం సిద్ధమైంది. పార్టీలో చేరికరోజే ఇందుకు సంబంధించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే.. ఆయన సొంత యూట్యూబ్ చానెల్‌తో పాటు.. సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టివ్‌గా ఉంటూ వైసీపీ వారిపై నిత్యం కౌంటర్ల వర్షం కురిపిస్తుంటారు. అందుకే ఈయనకు టీడీపీ సోషల్ మీడియాలో బాధ్యతలు అప్పగించే పార్టీకి కలిసొస్తుందని అధిష్టానం యోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈయన రాక టీడీపీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.