Telugudesam : TDP లో చేరేందుకు సిద్ధమైన ప్రముఖ విద్యాసంస్థల అధినేత.. గతంలో జస్ట్ మిస్ట్.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా..!?

ABN , First Publish Date - 2023-02-22T18:03:14+05:30 IST

ఏపీలోని ఓ ప్రముఖ విద్యాసంస్థల అధినేత టీడీపీ (Telugudesam) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పసుపు కండువా కప్పుకోవాలని భావిస్తున్నారా..? గత ఎన్నికల్లో చివరి నిమిషంలో ఎంపీ సీటు (MP Ticket) మిస్సవ్వగా..

Telugudesam : TDP లో చేరేందుకు సిద్ధమైన ప్రముఖ విద్యాసంస్థల అధినేత.. గతంలో జస్ట్ మిస్ట్.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా..!?

ఏపీలోని ఓ ప్రముఖ విద్యాసంస్థల అధినేత టీడీపీ (Telugudesam) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పసుపు కండువా కప్పుకోవాలని భావిస్తున్నారా..? గత ఎన్నికల్లో చివరి నిమిషంలో ఎంపీ సీటు (MP Ticket) మిస్సవ్వగా.. ఈసారి ఎమ్మెల్యేగా (MLA) అయినా పోటీ చేసి చట్ట సభల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారా..? ఇందుకోసం ఓ నియోజకవర్గాన్ని కూడా ఆయన ఫిక్స్ చేసుకున్నారా..? ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఇప్పట్నుంచే కీలక నేతలతో మంతనాలు ప్రారంభించారా..? అంటే తాజా పరిణామాలను బట్టి ఇవే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ ఆయనెవరు..? ఆయన పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం ఏది..? గతంలో టీడీపీ ఎందుకు సీటివ్వలేదు..? ఇప్పుడు చంద్రబాబు ఓకే అంటారా..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఆయన ఎవరో కాదండోయ్..!

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పేరుగాంచిన విద్యా సంస్థల్లో భాష్యం (Bhashyam Educational Institutions) ఒకటి. అతి తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ విద్యాసంస్థల జాబితాలో చేరిపోయింది భాష్యం. విద్య పరంగా అన్ని విధాలా సక్సెస్ అయిన భాష్యం రామకృష్ణ.. (Bhashyam Rama Krishna) రాజకీయాల్లోకి రావాలని కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే గట్టి ప్రయత్నాలు ప్రతిసారి చివరి నిమిషంలో టికెట్ చేజారిపోతోంది. 2019 ఎన్నికల్లో నరసారావుపేట (Narasaraopet)నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణల వల్ల ఎంపీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత పెదకూరపాడు (Pedakurapadu) అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా పోటీచేయాలని టీడీపీ అధిష్టానంతో కొన్ని రోజులపాటు మంతనాలు జరిపారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. అధిష్టానం రేపో మాపో అభ్యర్థిగా ప్రకటిస్తుందనకున్న సమయంలో సీన్ మొత్తం మారిపోయింది.

Bashyam.jpg

ఈసారైనా దక్కేనా..!

2024 ఎన్నికల్లో (2024 Elections) అయినా టీడీపీ తరఫున పోటీచేయాలని ఇప్పట్నుంచే రామకృష్ణ వ్యూహాలు రచించుకుంటున్నారట. వీలైనంత త్వరలోనే టీడీపీలో చేరి ఈసారి ఎంపీగా పోటీచేయకూడదని.. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని భావిస్తున్నారట. గతంలో తాను ఎక్కడ్నుంచి అయితే సీటు ఆశించారో అక్కడ్నుంచే ఈసారి ఎలాగైనా పోటీ చేసి.. గెలిచి నిలవాలని ధీమాగా ఉన్నారట. అందుకే ఈసారి కూడా పెదకూరపాడు అసెంబ్లీ స్థానాన్నే ఆయన ఎంచుకున్నారట. రామకృష్ణ స్వగ్రామం పెదకూరపాడులోని అమరావతి (Amaravati) మండలం. అందుకే ఇప్పట్నుంచే తన అనుచరులు, కార్యకర్తలను నియోజకవర్గంలోకి దింపేశారట. ఈసారి కచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu) ఒప్పించి.. మెప్పించి టికెట్ తెచ్చుకుంటాననే ధీమా ఆయనకు ఉందట.

Bashyam-2.jpg

చంద్రబాబుతో మంచి సంబంధాలు..!

చంద్రబాబుతో భాష్యం రామకృష్ణకు మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. విద్యాసంస్థల అధినేతతో పాటు సామాజిక సేవ చేసి ఏపీలో మంచి గుర్తింపు కూడా ఆయన సంపాదించుకున్నారు. హుదూద్ తుఫాను, కేరళ వరద బాధితులకు సాయం చేయడంలో ఇలా పలుమార్లు చంద్రబాబు పిలుపు మేరకు భారీగానే ఆయన విరాళాలు ప్రకటించారు. అప్పట్లో అన్నా క్యాంటిన్లు నిర్వహణకు కూడా భాష్యం తరఫున పాతిక లక్షలకు పైగా విరాళంగా ఇచ్చారు. ఆయన చేసిన సామాజిక సేవలతో రామకృష్ణ చంద్రబాబు దగ్గర మరిన్ని మార్కులు కొట్టేశారు. ఈ సాన్నిహిత్యంతోనే గతంలో టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణలతో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి.

Bashyam-3.jpg

ఇప్పుడెందుకు ఇంత హడావుడి..!

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) గురువారం నాడు (ఫిబ్రవరి-23న) టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు ముఖ్యనేతలు, పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు టీడీపీలో చేరబోతున్నారు. గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కన్నాకు బాగా పట్టుందని ఆయన అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. రేపు పార్టీలో చేరబోతుండగా.. బుధవారం మధ్యాహ్నం కన్నాతో భాష్యం రామకృష్ణ భేటీ అయ్యారు. స్వయంగా కన్నా ఇంటికి వెళ్లిన రామకృష్ణతో.. ఆయనతో ఏకాంతంగా గంటపాటు పలు విషయాలపై చర్చించుకున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరి భేటీపై అటు టీడీపీలో.. ఇటు వైసీపీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. రామృష్ణ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని అనడానికి ఇదే నిదర్శనమని ఆయన సన్నిహితులు కూడా చెప్పుకుంటున్నారు.

Bashyam-1.jpg

రామకృష్ణ పోటీచేయాలని ఫిక్స్ అయిన పెదకూరపాడు నుంచి 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి కన్నా గెలుపొందారు. ఆయన మళ్లీ ఇప్పుడు టీడీపీలోకి వస్తుండటంతో తనకు అన్ని విధాలుగా సపోర్టు చేయాలని కన్నాను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా అనుభవాలు, ఆశీర్వాదాలు తనపై ఉండాలని రామకృష్ణ కోరినట్లు తెలుస్తోంది. టికెట్ విషయమై..‘ చంద్రబాబుతో కూడా మీరే దగ్గరుండి చర్చించాలి.. టికెట్ ఇప్పించే బాధ్యత కూడా మీదే’ అని కన్నాను రెక్వెస్ట్ చేసినట్లు సమాచారం. ఇన్నాళ్లు రాజకీయంగా మీడియాలో ఎక్కడా కనిపించిన భాష్యం అధినేత ఇప్పుడు కన్నాతో భేటీ కావడంతో వార్తల్లో నిలిచారు. ఆయన రాజకీయ అరంగేట్రంపై చర్చ జరుగుతోంది.

Bashyam-5.jpg

మొత్తానికి చూస్తే.. గతంలో మిస్సయినా ఈసారి మాత్రం పక్కాగా టికెట్ ఇప్పించుకుని గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని రామకృష్ణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం నాడు కన్నాతో పాటు రామకృష్ణ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పార్టీలో చేరి పోటీ చేయాలని రామకృష్ణ అనుకుంటున్నారు సరే.. మరి చంద్రబాబు మనసులో ఏముంది..? కన్నా సీటు ఇప్పించగలరా..? ఒకవేళ సీటు ఇస్తే పరిస్థితేంటి..? ఇవ్వకపోతే సీన్ ఎలా ఉండబోతోంది..? అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి.

Bashyam-4.jpg

**********************************

ఇవి కూడా చదవండి..

**********************************

TS Congress : రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదీ.. ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా..!

**********************************

Telugudesam : టీడీపీలో చేరబోతున్న కన్నాపై వైసీపీకి ఎందుకింత పైత్యం.. ఏపీ మంత్రి ఇంత మాట అనేశారేంటి..!

**********************************

YSRCP ALI : ఆ నాలుగు నియోజకవర్గాలపై అలీ కన్ను.. సొంతంగా సర్వేలు.. టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ధీమా.. అన్నీ సరే అయ్యే పనేనా..!?
**********************************

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

**********************************

YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!


**********************************

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..


**********************************

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

**********************************

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-22T19:35:33+05:30 IST