Revanth Reddy: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై కేసీఆర్ చర్యలెందుకు తీసుకోవట్లేదు?
ABN , First Publish Date - 2023-03-10T17:24:46+05:30 IST
బీజేపీ ప్రభుత్వం (BJP government)పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ (ED), సీబీఐ (CBI)ని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం (BJP government)పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ (ED), సీబీఐ (CBI)ని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతోందో ఈడీ వివరణ ఇవ్వట్లేదని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించినట్లు..లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని రేవంత్ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై చర్యలెందుకు తీసుకోవట్లేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి పేపర్ పులుల్లా అరుస్తున్నారని, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్రమంత్రులే చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందని, సంజయ్, BRS మధ్య చీకటి ఒప్పందమేంటో ప్రజలే గుర్తిస్తారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు... ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ జరగాల్సి ఉంది. అయితే నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ అయ్యారు. ఆయన నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేశారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది.
రేపు రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. నిజానికి 9వ తేదీనే ఆమెను విచారించాల్సి ఉంది. అయితే ఆమె ముందుగానే ఖరారైన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. 11న విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిళ్లై తన వాంగ్మూలంలో తాను కవిత బినామీనని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. అలాగే ఒక కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయని తెలిపారు.