YSRTP : ఢిల్లీకెళ్లిన వైఎస్ షర్మిల హైదరాబాద్‌కు ఎలా వచ్చారంటే.. ఈ ఒక్క సీన్‌తో..!?
ABN , First Publish Date - 2023-08-11T22:05:04+05:30 IST
అవును.. వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు దాదాపు కొలిక్కివచ్చేశాయ్!. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల (YS Sharmila) వరుస భేటీలతో బిజిబిజీగా గడిపారు. గురు, శుక్రవారం రెండ్రోజులు హస్తినలో ఉన్న ఆమె.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకున్నారు..
అవును.. వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు దాదాపు కొలిక్కివచ్చేశాయ్!. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల (YS Sharmila) వరుస భేటీలతో బిజిబిజీగా గడిపారు. గురు, శుక్రవారం రెండ్రోజులు హస్తినలో ఉన్న ఆమె.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) నుంచి చాలా హ్యాపీగా షర్మిల బయటికొచ్చారు. మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు కానీ.. నవ్వుతూనే వెళ్లిపోయారు. పార్టీ విలీనంపై మాట్లాడటానికి నిరాకరించినప్పటికీ.. త్వరలో అన్ని విషయాలు చెబుతానని ఒకే ఒక్క మాట చెప్పారంతే. ఈ ఒక్కసీన్‌తో ఢిల్లీ వేదికగా చర్చలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని అర్థం చేసుకోవచ్చు.
ఇంట్రెస్టింగ్ సీన్..!
ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ సీన్ ఏమిటంటే.. ఢిల్లీ (Delhi) నుంచి హైదరాబాద్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) , కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komati Reddy Venkata Reddy) ఇద్దరూ ఒకే విమానంలో వచ్చారు. ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. కానీ.. నవ్వుతూనే బయటికి వచ్చారు. ఒకవేళ ఢిల్లీలో చర్చలు సవ్యంగా సాగకపోయినా.. ఈమె కండిషన్లకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. చర్చలు సక్సెస్ కావడంతోనే షర్మిల నవ్వేసి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు విలీనం అనే మాట నిజం కాకపోయినా.. ఢిల్లీలో చర్చలు అనేది కూడా అబద్ధమైతే షర్మిల నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో.. దీన్ని బట్టి చూస్తే చర్చలు సఫలం అయ్యాయి.. ఇక విలీనమే తరువాయి అన్న మాట.
చర్చలు ఇలా సక్సెస్!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విలీనం తర్వాత.. రానున్న ఎన్నికల్లో పాలేరు లేదంటే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలవని పక్షంలో మరోవైపు కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లబోతున్నాన్న ప్రచారమూ జరుగుతోంది. దీంతో పాటు 10 నుంచి 15 స్థానాల్లో తాను చెప్పిన అభ్యర్థులను నిలబెట్టాలని.. ఏపీ రాజకీయాల్లో తలదూర్చే ప్రసక్తే లేదని.. కనీసం ప్రచారం చేయడానికి కూడా తాను సాహసం చేయనని కరాఖండిగా కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల తేల్చి చెప్పినట్లు తెలియవచ్చింది. అయితే.. షర్మిల డిమాండ్స్‌కు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావడమే మొదటి ప్రాధాన్యత అని.. షర్మిలను కూడా ఇక్కడికే పరిమితం చేయాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజానిజాలెంతో.. త్వరలో అన్ని విషయాలు చెబుతానన్న షర్మిల మీడియా మీట్‌తో తేలిపోనున్నాయ్ అన్న మాట. ఏం జరుగుతుందో.. షర్మిల నోట ఏమేం కామెంట్స్ వస్తాయో వేచి చూడాలి మరి.