Viral News: కోళ్లను చంపితే 6 నెలల జైలు శిక్ష ఏంటని అవాక్కవుతున్నారా..? వింత టెక్నిక్‌తో ఓ వ్యక్తి 1100 కోళ్లను ఎందుకు చంపేశాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-04-10T17:49:43+05:30 IST
ఇరుగుపొరుగు అంటే చిన్న చిన్న గొడవలు సహజం. కొంత మంది అప్పటికప్పుడు మరిచిపోతుంటారు. మరి కొందరు పగ పెంచుకుంటారు. ఇంకొందరు వస్తువుల మీదనో.. జంతువుల మీదనో చూపిస్తుంటారు. అసలేం జరిగిందో తెలుసుకుంటే పగ ఈ విధంగా కూడా తీర్చుకుంటారా? అని
ఇరుగుపొరుగు అంటే చిన్న చిన్న గొడవలు సహజం. కొంత మంది అప్పటికప్పుడు మరిచిపోతుంటారు. మరి కొందరు పగ పెంచుకుంటారు. ఇంకొందరు వస్తువుల మీదనో.. జంతువుల మీదనో చూపిస్తుంటారు. అసలేం జరిగిందో తెలుసుకుంటే పగ ఈ విధంగా కూడా తీర్చుకుంటారా? అని ఆశ్చర్యపోతారు.
ఓ వ్యక్తి మీద కోపంతో పొరుగింటి వ్యక్తి... కోళ్లను చంపేశాడు. కోళ్లను చంపినందుకు ఆ వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష (six months) విధించింది. ఇదేంటి? కోళ్లను చంపినందుకే జైలు శిక్ష ఏంటి? అని అనుకుంటున్నారా? ఆ నిందితుడు చంపినవి ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 1,100 కోళ్లు చంపేశాడు. ఈ సంఘటన చైనా (China) లో చోటుచేసుకుంది.
ఆ రెండు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉంటాయి. పొరుగింట్లో ఉంటున్న వ్యక్తితో (man) జాంగ్‌కు గతేడాది నుంచి వివాదం నడుస్తోంది. తన అనుమతి లేకుండా చెట్లను నరికేస్తున్నాడని ఇద్దరి మధ్య గొడవ నడుస్తోంది. దీంతో ఆ వ్యక్తి.. జాంగ్‌పై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో జాంగ్ కోళ్ల ఫామ్ (Chicken farm)లోకి ప్రవేశించి కోళ్ల ముఖాలపైకి ఫ్లాష్‌లైట్ కొట్టాడు. దీంతో కోళ్లన్నీ ఒక పక్కకు చేరి మృత్యువాత పడ్డాయి.
ఒకే రోజు ఏకంగా 460 కోళ్లు చనిపోవడంతో జాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పొరుగున ఉన్న వ్యక్తే కోళ్లను చంపినట్లుగా నిర్ధారించి పోలీసులు పట్టుకున్నారు. దీంతో నష్టపరిహారంగా రూ. 35,700 చెల్లించాలని రాజీ కుదిర్చారు. అయినా కూడా అతనిలో మార్పు రాకపోగా ఈ ఘటనతో జాంగ్‌పై మరింత ఆగ్రహాన్ని పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. అంతే మరోసారి కోళ్ల ఫామ్‌లోకి ప్రవేశించి రెండో సారి ఫ్లాష్‌లైట్ వేసి కోళ్లను భయపెట్టడంతో ఈసారి ఏకంగా 640 కోళ్లు చనిపోయాయి. ఇలా మొత్తం 1,100 కోళ్లు చనిపోయాయి.
జాంగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మళ్లీ పాత నిందితుడ్నే అరెస్ట్ చేసి చైనాలోని హునాన్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగానే ఇతరుల ఆస్తి నష్టం కలిగించేందుకే నిందితుడు ప్రవర్తించినట్లు కోర్టు (court sentenced) గుర్తించి ఆరు నెలలు జైలు శిక్ష (jail) విధించింది.
ఇది కూడా చదవండి: Crime News: భర్త చనిపోతే రూ.20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని పక్కా స్కెచ్.. అంతా భార్య పనేనని 3 రోజుల్లోనే పోలీసులు ఎలా తేల్చారంటే..
ఇది కూడా చదవండి: Viral Video: చేతులెత్తి మొక్కుతున్నాం.. వదిలేయండన్నా వినని గ్రామస్తులు.. అక్కాతమ్ముళ్లను చెట్టుకు కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టడం వెనుక..