Share News

Alcohol: విస్కీ, వైన్‌లో నీళ్లు కలుపుకొని తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..

ABN , Publish Date - Dec 29 , 2023 | 04:54 PM

కొందరు మందుబాబులు ఓకే బ్రాండ్‌కి అలవాటు పడితే.. మరికొందరు వివిధ రకాల బ్రాండ్లు ట్రై చేస్తూ చివరకు వారికి నచ్చిన మందును తాగుతుంటారు. కొందరు విస్కీని ఇష్టపడితే.. మరికొందరు వైన్‌కి అలవాటు పడుతుంటారు. అయితే చాలా మంది కామన్‌గా చేసే పొరపాటు ఏంటంటే..

Alcohol: విస్కీ, వైన్‌లో నీళ్లు కలుపుకొని తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..

కొందరు మందుబాబులు ఓకే బ్రాండ్‌కి అలవాటు పడితే.. మరికొందరు వివిధ రకాల బ్రాండ్లు ట్రై చేస్తూ చివరకు వారికి నచ్చిన మందును తాగుతుంటారు. కొందరు విస్కీని ఇష్టపడితే.. మరికొందరు వైన్‌కి అలవాటు పడుతుంటారు. అయితే చాలా మంది కామన్‌గా చేసే పొరపాటు ఏంటంటే.. బ్రాండ్ ఏదైనా అందులో నీటిని విధిగా కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దాని రుచి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు విస్కీ, వైన్‌లో నీళ్లు ఎందుకు కలపకూడదో, ఎంత మేర కలుపుకోవాలో.. దానికి ప్రత్యామ్నాయంగా ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. కొత్త ఏడాది వస్తోందంటే.. వివిధ రకాల వస్తువుల అమ్మకాలతో పాటూ మద్యం విక్రయాలు కూడా విపరీతంగా ఉంటాయి. మందుబాబులు సాధారణంగా విస్కీ లేదా వైన్ తీసుకుంటుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే వారు పెద్ద తప్పు చేస్తుంటారు. గ్లాసులో మందు పోయగానే.. వెంటనే అందులో నీళ్లు పోసేస్తుంటారు. అయితే నీటిని పరిమితిలో వాడితేనే ప్రయోజనం ఉంటుంది. అందుకు బదులుగా కొన్ని పదార్థాలను అందులో మిక్స్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది.

wine-and-water.jpg


విస్కీని కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా తయారు చేస్తుంటారు. గోధుమ, బార్లీ , మొక్కజొన్న, రై వంటి ఎంపిక చేసిన తృణధాన్యాలను వివిధ ప్రక్రియల ద్వారా ఏళ్ల తరబడి ఫెర్మెంటేషన్ చేస్తారు. వీటి గుజ్జు నుంచి వచ్చే పానీయాన్ని చెక్క బారెల్స్‌లో నిల్వ చేస్తారు. ఆ పానీయం ముదురు రంగు వచ్చేందుకు సుమారు మూడు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాగే బ్రాందీని ద్రాక్షతో తయారు చేస్తారు. అదేవిధంగా ఆపిల్, పీచెస్, ఆప్రికాట్ వంటి ఇతర పండ్లను కూడా వినియోగిస్తుంటారు. ఇది కూడా పూర్తి పరిపక్వతకు రావాలంటే సుమారు రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

విస్కీ లేదా వైన్‌లో మినరల్ వాటర్‌ని చాలా తక్కువ పరిమాణంలో కలుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కవ కలపడం వల్ల విస్కీ అసలు రుచి తగ్గిపోతుందట. విస్కీలో నీటికి బదులుగా జిన్, టానిక్ వాటర్ వంటి వాటిని కలపడం వల్ల కొత్త రుచి వస్తుంది. ఇందులో టానిక్ వాటర్ అయితే విస్కీకి మంచి మిక్సర్‌గా పని చేస్తుందట. అయితే ఈ మిశ్రమంలో కొన్ని ఐస్ క్యూబ్స్ విధిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

wine-viral-news.jpg

విస్కీలో నీళ్లకు బదులుగా నిమ్మరసం కలపడం వల్ల కూడా కొత్త రుచి వస్తుంది. గ్లాసులో మద్యం కలిపాక దానిపై కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి తాగితే కొత్త అనుభూతి కలుగుతుందట. అదేవిధంగా కూల్‌డ్రింక్, ఐస్ క్యూబ్స్ కాంబినేషన్ కూడా బాగుంటుందట. అయితే బ్రాండ్లను బట్టి మినరల్ వాటర్‌ను తగు మోతాదులో వాడాల్సి ఉంటుంది. కాగా, బ్రాండ్లు ఏవైనా మద్యపానం అలవాటు పరిమితంగా ఉంటేనే ఇబ్బంది ఉండదని, వ్యసనంగా మారితో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Viral Video: పాము ఎదురుగా.. అచ్చం కోబ్రాలాగే బుసకొట్టిన యువకుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Dec 29 , 2023 | 04:54 PM