Viral Video: అంతా ఇళ్లల్లో సామాన్లు తరలిస్తే.. వీళ్లేమో ఏకంగా ఎంత పని చేశారో చూడండి..
ABN , Publish Date - Dec 28 , 2023 | 06:02 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంత పెద్ద పనినైనా ఈజీగా చేసే వెసులుబాటు ఉంది. ఒకప్పుడు కలలో కూడా అసాధ్యం అనుకున్న పనులను ప్రస్తుతం సుసాధ్యం చేస్తున్నారు. ఫోన్ల తగ్గర నుంచి..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంత పెద్ద పనినైనా ఈజీగా చేసే వెసులుబాటు ఉంది. ఒకప్పుడు కలలో కూడా అసాధ్యం అనుకున్న పనులను ప్రస్తుతం సుసాధ్యం చేస్తున్నారు. ఫోన్ల తగ్గర నుంచి కంప్యూటర్ల వరకూ, బైకు, కారు, బస్సు తదితర వాహనాల దగ్గర నుంచి విమానాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు ఇళ్లు మారే సమయంలో సామాన్లను తరలించేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటినే మార్చేసే టెక్నాలజీ వచ్చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లో (Bihar) జరిగినట్లుగా తెలుస్తోంది. వాహనాల రాకపోకలతో ఓ రహదారి రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. రహదానికి అటువైపు పెద్ద ఇల్లు కదులుతూ కనిపిస్తుంది. ‘‘ఇదేంటీ.. ఇల్లు కదులుతోంది.. ఇది కలనా లేక నిజమా’’.. అంటూ చాలా మంది ఆసక్తిగా తిలకిస్తుంటారు. విచారించగా, కొందరు ఓ అంతస్తుతో కూడిన ఇంటిని (Home moving technology) లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో చెక్కుచెదరకుండా పెకలించి, క్రేన్ సాయంతో మరో చోటికి తరలిస్తున్నారని తెలిసింది.
తమ ప్రాంతంలో ఇంటిని ఇలా తరలించడం గతంలో ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో్! చూస్తుంటే.. సినిమాల్లో గ్రాఫిక్స్‌లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘విదేశాల్లోని టెక్నాలజీ.. మన దేశంలో చూడడం కొత్తగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇన్నాళ్లు ఇలాంటి టెక్నాలజీ గురించి విన్నాం.. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.