Viral Video: కారు చోరీ కాకుండా ఇతడు తీసుకున్న ముందు జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Dec 28 , 2023 | 08:26 PM
చోరీల బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా దొంగలు చాలా తెలివిగా చోరీలకు పాల్పడుతుంటారు. ఇళ్లల్లోకి అత్యంత చాకచక్యంగా చొరబడడం, పార్క్ చేసిన పెద్ద పెద్ద వాహనాలను సైతం ఈజీగా చోరీ చేస్తుంటారు. దీంతో...
చోరీల బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా దొంగలు చాలా తెలివిగా చోరీలకు పాల్పడుతుంటారు. ఇళ్లల్లోకి అత్యంత చాకచక్యంగా చొరబడడం, పార్క్ చేసిన పెద్ద పెద్ద వాహనాలను సైతం ఈజీగా చోరీ చేస్తుంటారు. దీంతో వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి తన కారు చోరీ కాకుండా తీసుకున్న ముందు జాగ్రత్తలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్కార్పియో కారును (Scorpio car) ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే దొంగలెవరైనా ఎత్తుకెళ్తారో అనే భయంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే అతడు చేసిన పని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కారుపై కప్పిన కవర్ తీయకుండా ఉండేందుకు.. ఇంజిన్ పైభాగంలో కవర్‌పై ముళ్లుళ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను అమర్చాడు. వాటిని కారుకు గట్గిగా కట్టి పెట్టాడు.
Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..
అంతటితో ఆగకుండా కారు వెనుక భాగంలోని ఇనుప రాడ్‌కు ఓ రోప్ తగిలించి, దాన్ని వెనుకే ఉన్న కరెంట్ స్తంభానికి కట్టేశాడు. దాన్ని తీయకుండా మళ్లీ తాళం కూడా వేశాడు. ఈ వాహన యజమాని అతి తెలివిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి తెల్లారిపోనూ’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తెలివితేటలు ఇతడికి మాత్రమే సొంతం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Crime News: ఫోన్ అడిగిన పాపానికి భార్య చేసిన నిర్వాకం.. భర్త అని కూడా చూడకుండా.. కత్తెరతో..