Woman: జైల్లో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. చూసిన మరుక్షణమే ఆమె పరిస్థితిని చూసి షాకైన పోలీసులు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-06-07T21:53:05+05:30 IST

గోవింద్ కుమార్ అనే వ్యక్తి పల్లవికుమారి అనే యువతిని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండడంతో ఎలాంటి సమస్యలూ లేవు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న పల్లవి.. ఇదే నెలలో ప్రసవం కావాల్సి ఉంది. ఈ సమయంలో..

Woman: జైల్లో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. చూసిన మరుక్షణమే ఆమె పరిస్థితిని చూసి షాకైన పోలీసులు.. చివరకు ఏం జరిగిందంటే..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండడంతో ఎలాంటి సమస్యలూ లేకుండా సంతోషంగా గడిపేవారు. అయితే వీరి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. త్వరలో తల్లి కాబోతున్నాననే సంతోషం.. అంతలోనే ఆవిరైపోతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. ఇటీవల జైల్లో ఉన్న భర్తను కలిసిందుకు వెళ్లిన భార్య పరిస్థితిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) భాగల్పూర్‌లోని ఘోఘా పరిధి జానిదిహ్ ప్రాంతానికి చెందిన గోవింద్ కుమార్ అనే వ్యక్తి పల్లవికుమారి (24) అనే యువతిని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి (love marriage) చేసుకున్నాడు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండడంతో ఎలాంటి సమస్యలూ లేవు. ప్రస్తుతం గర్భిణిగా (pregnant) ఉన్న పల్లవి.. ఇదే నెలలో ప్రసవం కావాల్సి ఉంది. ఈ సమయంలో విధి వీరిపై చిన్న చూపు చూసింది. 8నెలల క్రితం భూమి విషయంలో గోవింద్‌కు సమీపంలోని వినోద్ యాదవ్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. ఈ కేసులో గోవింద్‌ను పోలీసులు జైలుకు (prison) పంపారు. అప్పటి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. భర్తను చూసి వద్దామని మంగళవారం మధ్యాహ్నం జైలుకు వెళ్లింది.

Viral Video: చికెన్ బిర్యానీ కోసం వీళ్ల కక్కుర్తి చూడండి.. తలుపు చాటున నిలబడి చివరకు ఎలాంటి ప్లాన్ వేశారంటే..

జైల్లో ఉన్న భర్తను చూడగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. వెంటనే స్పృహ తప్పి కిందపడిపోయింది. ఊహించని ఈ ఘటనతో షాకైన పోలీసులు.. కంగారుగా అక్కడికి వచ్చి, ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కావాల్సిన పల్లవి.. చూస్తుండగానే ఇలా అందరినీ వదిలి వెళ్లిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. మరోవైపు పల్లవి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచం తీసుకుని గోవింద్‌ని జైలుపాలు చేశారని, అలా జరక్కుండా ఉండి ఉంటే పల్లవి చనిపోయేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Crime News: టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. సడన్‌గా వచ్చిన ఆటోను చూసి డౌట్.. ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని మరోసారి చూసి..

Updated Date - 2023-06-07T21:53:05+05:30 IST