Bride: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో బ్రహ్మాజీలా పెళ్లి చేసుకునేందుకు సంబరంగా వధువు ఇంటికి వెళ్లాడు కానీ..!
ABN , First Publish Date - 2023-07-22T16:51:46+05:30 IST
లేటు వయసులో ఎట్టకేలకు పెళ్లి కుదిరిందనే సంతోషంలో వధువుకు ఇంటికి వెళ్లిన వరుడికి చివరకు షాకింగ్ వార్త తెలుస్తుంది. వివాహ మంటపంలో ముహూర్త సమయం దగ్గరపడుతున్నా ఎంతకీ వధువు మాత్రం రాదు. చివరకు విచారిస్తే షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇది వెంకటాద్రి సినిమాలో సీన్. అయితే..
లేటు వయసులో ఎట్టకేలకు పెళ్లి కుదిరిందనే సంతోషంలో వధువుకు ఇంటికి వెళ్లిన వరుడికి చివరకు షాకింగ్ వార్త తెలుస్తుంది. వివాహ మంటపంలో ముహూర్త సమయం దగ్గరపడుతున్నా ఎంతకీ వధువు మాత్రం రాదు. చివరకు విచారిస్తే షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇది వెంకటాద్రి సినిమాలో సీన్. అయితే నిజ జీవితంలోనూ దాదాపు ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వధువు గ్రామానికి వెళ్లిన వరుడు చివరకు షాక్ తిన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఎటాహ్ జిల్లా సోనభద్ర ప్రాంత పరిధికి చెందిన ఓ వ్యక్తికి వయసు పెరిగిపోతున్నా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఎంత ప్రయత్నించినా అతన్ని వివాహం (marriage) చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో సోనభద్రలో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయలో అతడికి ఓ యువకుడు పరిచయం అవుతాడు. ఇతడి సమస్య విని తాను పెళ్లి సంబంధం కుదర్చుతానని హామీ ఇస్తాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి.. ‘‘మీకు పెళ్లి సంబంధం కుదిరింది.. మీ కుటుంబ సభ్యులతో సహా సోనభద్రకు వచ్చేయండి.. ఇక్కేడ వివాహం జరిపిస్తాం’’.. అని చెప్పడంతో సంబరపడిపోతాడు. అంతే సంబరంగా మొత్తం 8మంది కుటుంబ సభ్యులతో కలిసి సోనభద్రకు చేరుకున్నాడు.
ఫోన్ చేసిన వ్యక్తి అప్పటికే అక్కడ ఓ యువతిని సిద్ధం చేసి, ఆమె తల్లిదండ్రులుగా నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేసి ఉంటాడు. వరుడికి వారిని పరిచయం చేసిన తర్వాత వధువు (bride) కుటుంబ సభ్యులు పేదవాళ్లని చెప్పి.. దుస్తుల కోసం డబ్బులు అడుగుతాడు. దీంతో వరుడు ముందుగా వారికి రూ.10వేలు అందజేస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం ముహూర్థం ఖరారు చేసుకుంటారు. అయితే ఉదయం మళ్లీ వరుడి వద్దకు వచ్చి.. పెళ్లికి సంబంధించి మరికొన్ని సరుకులు తీసుకోవాల్సి ఉంది అని చెప్పి.. మరో రూ.25వేల నగదు ఇప్పిస్తాడు. వివాహానంతరం మంటపం నుంచి బయటకు వెళ్లిన వధువు తదితరులు అటు నుంచి అటే వెళ్లిపోయారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న (bride cheated the groom) వరుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.