Crime: చెల్లి తలను నరికి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడో అన్న.. అసలు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడో తెలిసి..!
ABN , First Publish Date - 2023-07-21T18:01:58+05:30 IST
కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. చివరకు వారిని జైలుపాలు చేస్తుంటాయి. చేస్తున్నది తప్పని తెలిసినా చాలా మంది తమ తీరు మార్చుకోరు. ఈ క్రమంలో చివరకు ఆత్మహత్యలు, హత్యలకు తెగబడుతుంటారు. యువతీయువకుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా..
కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. చివరకు వారిని జైలుపాలు చేస్తుంటాయి. చేస్తున్నది తప్పని తెలిసినా చాలా మంది తమ తీరు మార్చుకోరు. ఈ క్రమంలో చివరకు ఆత్మహత్యలు, హత్యలకు తెగబడుతుంటారు. యువతీయువకుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన చెల్లెలి తలను నరికి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అతను ఈ దారుణానికి పాల్పడడానికి గల కారణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బారాబంకి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫతేపూర్ కొత్వాలి ప్రాంత పరిధి మిత్వారా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతికి (young woman) , ఇదే ప్రాంతానికి చెందిన యువకుడితో కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య కొన్ని నెలలకే ప్రేమ (love) మొదలైంది. కుటుంబ సభ్యులకు తెలీకుండా తరచూ కలుసుకునేవారు. అయితే ఇటీవల వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి యువతిని మందలించారు. చెల్లిలి ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంకోసారి అతడిని కలిస్తే చంపుతానంటూ బెదిరించాడు. కొన్నాళ్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు విన్న యువతి.. తర్వాత మళ్లీ ప్రేమికుడిని కలుస్తూ ఉండేది.
ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో గత మేలో ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరుడికి కోపం కట్టలు తెంచుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చెల్లిలి గురించి సమాచారం తెలుసుకున్న సోదరుడు.. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న అతను.. ఒక్కసారిగా చెల్లెలిపై (Brother attack on sister) కత్తితో దాడి చేశాడు. ఆమె తలను నరికి తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యలో తెగిన తల పట్టుకుని వెళ్తున్న యువకుడిని చూసి అంతా భయాందోళనకు గురయ్యారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.