Pakistani Chaiwala: ఈ కుర్రాడు గుర్తున్నాడా..? 7 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయ్యాడు కానీ ఇప్పుడేం చేస్తున్నాడంటే..!

ABN , First Publish Date - 2023-07-21T19:58:45+05:30 IST

నీలి కళ్లతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకొన్న పాకిస్తాన్ చాయ్ వాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఫొటోగ్రాఫర్ దృష్టిలో పడ్డ అతను.. తర్వాత ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఎక్కడలేని ఫేమ్ వచ్చిపడింది. అనంతర కాలంలో...

Pakistani Chaiwala: ఈ కుర్రాడు గుర్తున్నాడా..? 7 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయ్యాడు కానీ ఇప్పుడేం చేస్తున్నాడంటే..!

నీలి కళ్లతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకొన్న పాకిస్తాన్ చాయ్ వాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఫొటోగ్రాఫర్ దృష్టిలో పడ్డ అతను.. తర్వాత ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఎక్కడలేని ఫేమ్ వచ్చిపడింది. అనంతర కాలంలో మోడల్‌గా, యాక్టర్‌గా కూడా మారిపోయాడు. కనీసం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అంటే ఏంటో కూడా తెలీని ఇతను.. రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అయితే ప్రస్తుతం ఇతను ఏం చేస్తున్నాడనే సందేహం చాలా మందికి వస్తోంది. ఒక్క ఫొటోతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ చాయ్‌వాలా.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

ఉన్నట్టుండి ఫేమస్ అయిపోయిన పాకిస్తాన్ చాయ్‌వాలా (Pakistan Chaiwala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 17 మంది తోబుట్టువుల తర్వాత పుట్టిన అర్షద్ ఖాన్ అనే యువకుడు టీ స్టాల్ (tea stall) పెట్టుకుని జీవనం సాగించేవాడు. 2016లో ఇస్లామాబాద్‌కు (Islamabad) చెందిన జియా అలీ అనే ఫొటోగ్రాఫర్.. అర్షద్‌ తన దుకాణంలో ఉండగా ఫొటో తీశారు. ఆ ఫొటోను (Viral photo) సోషల్ మీడియలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. దీంతో అతడి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఇతను ఏం చేస్తున్నాడని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అర్షద్‌ లండన్‌లోని (London) ఇల్‌ఫోర్డ్ లేన్‌లో కొత్తగా కేఫ్ ప్రారంభించినట్లు తెలిసింది.

Viral Video: తిమింగళం మీదకు దూకేసిన వ్యక్తి.. తప్పించుకోవడం ఇక అసాధ్యం అనుకుంటే.. చివరకు ఛత్రపతిని మించిపోయాడుగా..

అర్షద్‌ కొత్త టీ దుకాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీ దుకాణాన్ని మొత్తం వినూత్నంగా డిజైన్ చేశాడు. దక్షిణాసియా సంప్రదాయానికి అనుగుణంగా దుకాణం గోడలపై పెయింటింగ్ వేయించాడు. ‘‘నన్ను అభిమానించే వారికి మంచి టీ అందించేందుకు ఇష్టపడతా. నా మొదటి అంతర్జాతీయ చాయ్ దుకాణానికి అభిమానుల నుంచి విపరీతమైన వస్తోంది’’.. అని అర్షద్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న అర్షద్ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మహానటి సావిత్రమ్మే మళ్లీ పుట్టిందా ఏంటీ..? గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు.. ఐశ్వర్యారాయ్ డైలాగ్స్‌ను చెబుతూనే..!

Updated Date - 2023-07-21T19:58:45+05:30 IST