Aeroplane: విమానంలో షాకింగ్ ఘటన.. బాత్రూంలో మీరేం చేస్తున్నారంటూ ఓ ప్రయాణీకుడిని సిబ్బంది నిలదీస్తే.. అతడు చెప్పింది విని..

ABN , First Publish Date - 2023-05-18T16:16:01+05:30 IST

కొన్ని ప్రమాదకరమైనవి వస్తువులు ఉంటాయి. వాటిని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి కుదరదు. అగ్నికి సంబంధించిన వస్తువులను రైల్లోగానీ.. విమానాల్లో గానీ.. బస్సుల్లో గానీ తీసుకెళ్లడానికి

Aeroplane: విమానంలో షాకింగ్ ఘటన.. బాత్రూంలో మీరేం చేస్తున్నారంటూ ఓ ప్రయాణీకుడిని సిబ్బంది నిలదీస్తే.. అతడు చెప్పింది విని..
Aeroplane

కొంత మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరికి సిగరెట్లు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరికీ బీడీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరికీ చుట్ట కాల్చే అలవాటు ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే కిళ్లీ, పాన్, గుట్కా నమిలే అలవాటు ఉంటుంది. ఇలా రకరకాలైన మనుషులు దర్శనమిస్తుంటారు. అయితే ఈ అలవాట్లు ఉన్న వారు ఎక్కడ పడితే అక్కడ వినియోగిస్తుంటారు. ఇంట్లో చేసినట్టుగానే బయట కూడా అదే మాదిరిగా చేస్తుంటారు. దీంతో ఇతరులు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి. అందుకే ప్రభుత్వాలు వీటికి కొన్ని షరతులు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే జరిమానా విధిస్తుంది. అక్కడక్కడ ఇలాంటి బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. అలాగే పాన్, గుట్కా వంటి పదార్థాలను కూడా నిషేధించాయి. అయినా కూడా చాలా మంది చాటు మాటున వినియోగిస్తూనే ఉంటారు. కొంత మంది రైళ్లల్లోనూ. బస్సుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు తింటూ ఊసేస్తుంటారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోతుంటాయి.

కొన్ని ప్రమాదకరమైనవి వస్తువులు ఉంటాయి. వాటిని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి కుదరదు. అగ్నికి సంబంధించిన వస్తువులను రైల్లోగానీ.. విమానాల్లో గానీ.. బస్సుల్లో గానీ తీసుకెళ్లడానికి అనుమతించరు. కారణమేంటంటే ప్రమాదం సంభవిస్తే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం వీటికి అనుమతి ఉండదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. విన్నాం. అయినా కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ విమానంలో జరిగిన సంఘటనతో అంతా భయాందోళనకు గురయ్యారు.

ఓ ప్రయాణికుడు ఏకంగా విమానంలోనే బీడీ కాలుస్తూ (smoking beedi) పట్టుబడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో (Bengaluru airport) చోటుచేసుకుంది. అతడిని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలిసారి తాను విమానంలో ప్రయాణించానని.. నిబంధనల గురించి తనకు తెలియదని చెప్పుకురావడం విశేషం. గతంలో రైలు ప్రయాణాల్లో కూడా ఇలా ఎన్నోసార్లు బాత్రూంలో ధూమపానం చేశానని.. అదే విధంగా విమానంలో కూడా చేసినట్లు చెప్పుకురావడం కొసమెరుపు.

akake.gif

రాజస్థాన్‌లోని మార్వాడ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు (Aeroplane). అహ్మదాబాద్‌ నుంచి బెంగళూరుకు బయల్దేరాడు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌ రూమ్‌కు వెళ్లిన అతడు.. తన అలవాటు ప్రకారం బీడీ కాల్చడం మొదలుపెట్టాడు. స్మోక్‌ అలర్ట్‌ రావడంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది.. బాత్రూం నుంచి వస్తున్నట్లు గుర్తించారు. బయటకు వచ్చిన తర్వాత అతడిని ప్రశ్నించగా.. నిబంధనల గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. విమానం బెంగళూరు చేరుకున్నాక.. సదరు ప్రయాణికుడిని విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు ఇతర సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి విచారించారు. తనకు నిబంధనల గురించి తెలియదని వాపోయాడు. గతంలో ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసినప్పుడు టాయిలెట్లలో ధూమపానం చేశానని.. ఇప్పడు విమానంలో కూడా అలాగే ప్రయత్నించానని బదులిచ్చాడు.

ఇది కూడా చదవండి: Bride: పెళ్లి వేదికపైకి వచ్చిన వరుడిని చూసి అవాక్కైన వధువు.. అతడిని చేసుకోనంటూ ఆమె చెప్పిన కారణాలు విని అంతా షాక్..!

Updated Date - 2023-05-18T16:19:54+05:30 IST