Viral News: ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి.. మొదటి రోజే ఊహించని షాకిచ్చిన యజమాని.. ఆయన తెచ్చింది చూసి..!

ABN , First Publish Date - 2023-07-06T15:32:50+05:30 IST

పట్టణాలు, నగరాల్లో అద్దె దారుల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగారాల్లో అయితే వేలకు వేలకు చెల్లించాల్సిన పరిస్థితి. దీనికితోడు ఇంటి యజమానులు వివిధ రకాల కండీషన్లు పెడుతుంటారు. ఇక బెంగళూరులో ..

Viral News: ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి.. మొదటి రోజే ఊహించని షాకిచ్చిన యజమాని.. ఆయన తెచ్చింది చూసి..!
ప్రతీకాత్మక చిత్రం

పట్టణాలు, నగరాల్లో అద్దె దారుల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగారాల్లో అయితే వేలకు వేలకు చెల్లించాల్సిన పరిస్థితి. దీనికితోడు ఇంటి యజమానులు వివిధ రకాల కండీషన్లు పెడుతుంటారు. ఇక బెంగళూరులో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇటీవల అక్కడి ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి ఇబ్బందుల గురించి పలు వార్తలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో బెంగళూరులోని ఓ ఇంటి యజమానికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి సదరు యజమాని మొదటి రోజే షాక్ ఇచ్చాడు.

బెంగళూరుకు (Bangalore) చెందిన ఓ ఇంటి యజమాని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టు (Viral post) తెగ హల్‌చల్ చేస్తోంది. యజమాని తన ఇంట్లో అద్దెకు దిగుతున్న (rented family) కుటుంబానికి.. ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కిమ్చి అనే కొరియన్ డిష్‌ (Korean dish) తయారు చేసి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారు. ఇందుకోసం పులియబెట్టిన కూరగాయలతో కిలో డిష్‌ని సిద్ధం చేసింది. అనంతరం దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉంచింది. అద్దెకు దిగిన కుటుంబం.. ఇంట్లో తమ యజమాని (house owner) సిద్ధంగా ఉంచిన డిష్‌ను చూసి సంతోషంతో ఉప్పొంగిపోయారు.

Viral Video: నెటిజన్ల ఆగ్రహానికి గురైన యువతి.. స్పైడర్ మ్యాన్ వేషంలో వచ్చాడని.. మెల్లగా దగ్గరికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం..

బెంగళూరు ఇళ్ల యజమానులపై వివిధ ఆరోపణలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ ఇంటి యజమాని అందుకు విరుద్ధంగా ఇలా డిష్‌తో స్వాగతం పలకడం అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఇంటి యజమానిని అభింనదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆహా! ఈ యజమానిది ఎంత మంచి మనసు’’.. అని కొందరు, ‘‘అద్దెదారుల పట్ల మీ అభిమానం మరువలేనిది’’.. అంటూ మరికొందరు, తమ ఇంటి యజమానుల గురించి తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కరెంట్ లేకున్నా.. దుస్తులను ఇస్త్రీ చేస్తున్న ఈమె తెలివిని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

Updated Date - 2023-07-06T15:33:56+05:30 IST