Whatsapp: వాట్సప్ వీడియోలో స్నేహితుడి కూతురిని అలా చూసి షాక్ అయిన వ్యక్తి.. విచారించగా చివరకు ఏం తెలిసిందంటే..
ABN , First Publish Date - 2023-07-05T16:00:28+05:30 IST
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కళ్లతో చూసినా కూడా నిజమో.. కాదో.. చెప్పలేని పరిస్థితి. కొందరు టెక్నాలజీని తమ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తుంటారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కళ్లతో చూసినా కూడా నిజమో.. కాదో.. చెప్పలేని పరిస్థితి. కొందరు టెక్నాలజీని తమ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తుంటారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, లక్నోలో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. వాట్సప్‌కు వచ్చిన వీడియోలో స్నేహితుడి కుమార్తెను అసభ్యకర స్థితిలో చూసి ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. నిజమా, కాదా అని విచారించగా.. చివరకు ఏం తెలిసిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో పరిధి నిషాత్‌గంజ్ పరిధికి చెందిన ప్రసాద్ (పేరు మార్చాం) .. సంతక్‌బీర్ నగర్ ప్రాంతానికి చెందిన మనోజ్ (పేరు మార్చాం)తో కొన్నేళ్ల కిందట స్నేహం (friendship) ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు చర్చించుకుంటూ పరిష్కరించుకుంటూ ఉండేవారు. ఇదిలావుండగా, జూన్ 28న ప్రసాద్ ఫోన్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్ వీడియో (Whatsapp video) వచ్చింది. అందులో తన స్నేహితుడి కూతురు అసభ్యకర స్థితిలో ఉండడం చూసి షాక్ అయ్యాడు.
Viral Video: కూతురిని రైలు ఎక్కించిన తండ్రి.. తొందరపాటులో చేసిన తప్పు వల్ల... చివరకు ఏమైందో చూడండి..
నిజమా, కాదా కనుక్కోవాలని నేరుగా యువతికే ఫోన్ చేశాడు. చివరకు ఆమె చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొహమ్మద్ అనే వ్యక్తి గతంలో యువతిని (young woman) ప్రేమించమంటూ వెంటపడుతూ ఉండేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక చివరకు విషయం ఇంట్లో తెలియజేసింది. కుటుంబ సభ్యులు మందలించినా.. అతను మత్రం ఆమెను వెంటపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఫొటోలు సేకరించి, మార్ఫింగ్ చేసి వీడియో (Morphing video) తయారు చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.