Wife: వీడియోల్లో ఉన్నట్లుగానే చేయాలని చెప్పడంతో షాక్ అయిన భార్య.. వద్దని వారిస్తున్నా చివరకు అతడు చేసిన నిర్వాకంతో..
ABN , First Publish Date - 2023-07-05T18:55:32+05:30 IST
కొందరు బయట బుద్ధిమంతుల్లా కనిపించినా .. ఇంటికి వెళ్లగానే వారి అసలు స్వరూపం బయటపెడుతుంటారు. వారిలోని శాడిజాన్ని మొత్తం కుటుంబ సభ్యులపై చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా..
కొందరు బయట బుద్ధిమంతుల్లా కనిపించినా .. ఇంటికి వెళ్లగానే వారి అసలు స్వరూపం బయటపెడుతుంటారు. వారిలోని శాడిజాన్ని మొత్తం కుటుంబ సభ్యులపై చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఢిల్లీలో ఈ తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. అశ్లీల వీడియోలకు ఎడిక్ట్ అయిన భర్త.. అలాగే చేయమంటూ భార్యను వేధించేవాడు. అంతటితో ఆగకుండా అతడు చేసిన నిర్వాకంతో చివరకు ఏ జరిగిందంటే..
న్యూఢిల్లీలోని (New Delhi) ఈస్ట్ రోహ్తాష్ నగర్‌కు చెందిన యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన యువతితో (young woman) 2020లో వివాహమైంది. పెళ్లయిన కొత్తలో అందరిలాగానే భార్యను బాగా చూసుకున్న భర్త రాను రాను శాడిస్టుగా మారిపోయాడు. ఇటీవల అశ్లీల వీడియోలకు (Indecent videos) అలవాటు పడ్డాడు. నిత్యం ఫోన్‌లో వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇటీవల ఇతడి ప్రవర్తన మరీ దారుణంగా తయారైంది. అశ్లీల వీడియోలను భార్యకు చూపించి, అలాగే చేయాలంటూ ఒత్తిడి చేసేవాడు. అంతటితో ఆగకుండా వీడియోల్లో మహిళల మాదిరే దుస్తులు ధరించాలని చెప్పేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో (husband tortures his wife) చిత్రహింసలకు గురి చేసేవాడు.
కొడుకును మందలిచాల్సిన తల్లిదండ్రులు కూడా కోడిలినే వేధించేవారు. కట్నం తేవాలంటూ కొడుకుతో కలిసి కోడిలిని తీవ్రంగా కొట్టేవారు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో చివరకు ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి భర్త, అత్తమామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, తదుపరి చర్యల కోసం సాక్షులను కూడా విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.