Wife-Husband: పోలీస్ స్టేషన్‌కు వచ్చిందో భార్య.. భర్తపై వింత కేసు.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-08-03T21:49:15+05:30 IST
పెళ్లైన కొత్తలో భార్యను సంతోషంగా చూసుకునే చాలా మంది భర్తలు.. రాను రాను అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు చెడు అలవాట్లకు బానిసలై కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడితే.. మరికొందరు అనుమానం పెంచుకుని భార్యలను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇటీవల...
పెళ్లైన కొత్తలో భార్యను సంతోషంగా చూసుకునే చాలా మంది భర్తలు.. రాను రాను అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు చెడు అలవాట్లకు బానిసలై కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడితే.. మరికొందరు అనుమానం పెంచుకుని భార్యలను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇటీవల బెంగళూరుకు చెందిన మహిళకు విచిత్ర సమస్య వచ్చి పడింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె భర్తపై కేసు పెట్టింది. ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బెంగళూరులోని (Bangalore) కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్ అనే వ్యక్తికి పుష్ప అనే మహిళతో 23ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. మొదట్లో భార్యను బాగా చూసుకునే భర్త.. రాను రాను ఆమెను వేధించడం మొదలెట్టాడు. ఇటీవల అతడి చిత్రహింసలు (husband tortures his wife) మరింత పెరిగిపోయాయి. దీంతో విసిగిపోయిన భార్య.. కొడుకును తీసుకుని వేరే ప్రాంతంలో ఉంటోంది. భార్య దూరంగా ఉండడాన్ని సహించలేని భర్త.. ఆమెపై కోపం పెంచుకున్నాడు.
Viral Video: ఓ చిన్న అద్దం వల్ల కారు ఎలా కాలిపోయిందో చూడండి.. కారు డోర్ తీయగానే..!
ఇటీవల ఓ రోజు భార్య వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. భార్య ఎదురు ప్రశ్నిచండంతో విజయ్ కుమార్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. భార్యపై దాడి చేయడమే కాకుండా ఆమె ఎడమ చేతి (husband bit his wife's finger) వేలును కొరికి నమిలి మింగేశాడు. తాను చెప్పినట్లు వినకుంటే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగతా తీవ్ర చర్చనీయాశంగా మారింది.