Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

ABN , First Publish Date - 2023-08-03T15:12:30+05:30 IST

వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలతో పాటూ వినూత్న విన్యాసాలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. కొందరు వధూవరులు.. బంధువులు, స్నేహితులతో పాటూ డాన్సులు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు కళ్యాణ మంటపాల్లోకి చిత్రవిచిత్రంగా ఎంట్రీ ఇస్తుంటారు. దాదాపు ప్రతి ఒక్కరూ...

Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలతో పాటూ వినూత్న విన్యాసాలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. కొందరు వధూవరులు.. బంధువులు, స్నేహితులతో పాటూ డాన్సులు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు కళ్యాణ మంటపాల్లోకి చిత్రవిచిత్రంగా ఎంట్రీ ఇస్తుంటారు. దాదాపు ప్రతి ఒక్కరూ తమ వివాహ కార్యక్రమంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఈ తరహా వివాహాలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుకలో అందరి ఎదుటే వరుడిని వధువు చితకబాదింది. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమం సందర్భంగా అతిథులంతా కళ్యాణ మండపంలో వధూవరుల (bride and groom) కోసం వేచి చూస్తూ ఉంటారు. ఇంతలో వారిద్దరూ ఎంతో ఆనందంగా లోపలికి ఎంట్రీ ఇస్తారు. అయితే లోపలికి వచ్చీ రాగానే అందరికీ షాక్ ఇస్తారు. బంధువులంతా చూస్తుండగా వరుడిని వధువు కడుపుపై కాలితో తన్నుతుంది. అంతటితో ఆగకుండా WWE ఛాంపియన్ షిప్ తరహాలో వరుడి తల పట్టుకుని ధమేల్‌మని కింద పడేస్తుంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి రెఫరీ పాత్ర పోషిస్తాడు. కింద పడ్డ వరుడి కాలును వధువు పైకి ఎత్తి పట్టుకుంటుంది. దీంతో పక్కనున్న రెఫరీ ఒకటి నుంచి మూడు వరకూ కౌంట్ చేస్తాడు. చివరకు వధువును విజేతగా ప్రకటిస్తాడు.

Crime news: గంటల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లకు కడుపు నొప్పి.. కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చివరకు వారు చెప్పింది ఏంటంటే..

భార్య ఎదుట ఓడిపోయినందుకు వరుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. తనని గెలిపించినందుకు వధువు కూడా వరుడికి థ్యాంక్స్ చెబుతుంది. అయితే ఇదంతా కామెడీ కోసం చేస్తున్నారని తెలీక.. బంధువులంతా మొదట్లో షాక్ అవుతారు. తర్వాత విషయం తెలుసుకుని పగలబడి నవ్వుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతను రేపెప్పుడైనా భార్యపై చేయి చేసుకోవాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు’’.. అని కొందరు, ‘‘వావ్! ఈ వధువు టాలెంట్ సూపర్’’.. అంటూ మరికొందరు, వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విడియో ప్రస్తుతం 60వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. జనాలను ఏమార్చేందుకు నయా ప్లాన్.. ఫోన్‌ చేసి ఇలా మాట్లాడితే అస్సలు నమ్మొద్దు..!

Updated Date - 2023-08-03T15:12:30+05:30 IST