Crime: 3కిలోమీటర్లు నడిచి స్టేషన్‌కు వచ్చిన 11 ఏళ్ల బాలుడు.. వచ్చీ రాగానే ఏడుస్తోంటే ఏంటని అడిగిన పోలీసులకు..!
ABN , First Publish Date - 2023-06-28T21:47:06+05:30 IST
కుటుంబంలో తలెత్తే సమస్యలు కొన్నిసార్లు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ప్రధానంగా తరచూ గొడవలు పడే భార్యాభర్తలు.. వారికి తెలీకుండానే పిల్లలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు పిల్లలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా..
కుటుంబంలో తలెత్తే సమస్యలు కొన్నిసార్లు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ప్రధానంగా తరచూ గొడవలు పడే భార్యాభర్తలు.. వారికి తెలీకుండానే పిల్లలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు పిల్లలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. 11ఏళ్ల బాలుడు 3కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. వచ్చీ రాగానే ఏడుస్తూ ఉన్న అతన్ని ఏమందని పోలీసులు అడగడంతో ఏం చెప్పాడంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రాలోని పినాహత్ పంచాయతీ జాబ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హరిఓం అనే వ్యక్తికి.. భార్య, 11ఏళ్ల కొడుకు ఉన్నారు. హరి బ్యాంకులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే ఇటీవల ఇతను మద్యానికి బానిస (Alcoholic) అయ్యాడు. రోజూ ఫుల్‌గా తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. ఎదురు ప్రశ్నిస్తే మరింతగా చిత్రహింసలకు (husband tortures his wife) గురి చేసేవాడు. అయినా ఆమె ఎవరికీ చెప్పకుండా లోలోపలే భరిస్తూ వచ్చింది. కొన్నిసార్లు కొడుకు ఎదుటే భార్యను కొడుతుండేవాడు. దీంతో బాలుడు కూడా మానసికంగా తీవ్ర ఇబ్బంది పడేవాడు. అయితే తండ్రిపై భయంతో సైలెంట్‌గా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రోజూ మాదిరే మందు తాగి ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చీరాగానే మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఎదురు ప్రశ్నించినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన అతను.. భార్యను బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. తల్లిని అలా కొట్టడాన్ని చూసి బాలుడు (boy) తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇంటి నుంచి పరుగెత్తుకుంటూ 3కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. లోపలికి వెళ్లి ఒక్కసారిగా ఏడవటం మొదలెట్టాడు. దీంతో అక్కడున్న పోలీసులు కంగారుగా అతడి వద్దకు వెళ్లి.. ‘‘ఎందుకు ఏడుస్తున్నావ్ బాబూ.. ఏమైందీ’’.. అని ప్రశ్నించారు. బాలుడు జరిగిన విషయం చెప్పడంతో వెంటనే అతన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఇరువైపు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దంటూ మందలించి అతన్ని విడుదల చేశారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
PAN Card: పాన్‌కార్డు ఉందా..? శుక్రవారం లోగా ఈ ఒక్క పని చేయకపోతే.. మీ పాన్ కార్డ్ ఇకపై పనిచేయదు..!