Viral Video: తమ పెళ్లికి కేవలం స్నేహితులు మాత్రమే రావాలంటూ వధూవరుల కండీషన్.. చివరకు వీరంతా కలిసి కళ్యాణ మంటపంలో చేసిన పనేంటంటే..
ABN , First Publish Date - 2023-07-23T16:58:41+05:30 IST
పెళ్లంటేనే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల హడావుడితో కళకళలాడుతూ ఉంటుంది. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం కూడా పెళ్లిళ్లపై పడడడంతో.. చాలా మంది వారి వివాహ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఏ వివాహ కార్యక్రమంలో చూసినా ఏదో ఒక...
పెళ్లంటేనే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల హడావుడితో కళకళలాడుతూ ఉంటుంది. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం కూడా పెళ్లిళ్లపై పడడడంతో.. చాలా మంది వారి వివాహ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఏ వివాహ కార్యక్రమంలో చూసినా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తమ పెళ్లికి కేవలం స్నేహితులు మాత్రమే రావాలంటూ వధూవరులు వింత కండీషన్ పెట్టారు. కళ్యాణ మంటంపలో వారంతా కలిసి చేసిన పని చూసి అంతా అవాక్కవుతన్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ కళ్యాణ మంటపంలో (wedding hall) వధూవరుల కోసం స్నేహితులంతా ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో అందమైన దుస్తులు ధరించి వధూవరులు మంటపంలోకి వస్తారు. వారు వస్తుండడాన్ని గమనించిన యువతీయువకులంతా డాన్సులు వేస్తూ స్వాగతం పలుకుతారు. స్నేహితుల ఉత్సాహం చూసి వధూవరులు కూడా డాన్సులు వేసుకుంటూ లోపలికి వస్తారు. చివరకు అంతా కలిసి (bride and groom danced with friends) డీజే పాటలకు పిచ్చి పిచ్చిగా స్టెప్పులు వేస్తారు.
వీరి డాన్సు చూసి దూరంగా ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ‘‘వివాహాలకు మీ స్నేహితులను మాత్రమే ఆహ్వానించండి’’.. అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆహా! అంతా కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వివాహ ఆహ్వానాన్ని ఎక్కడా చూల్లేదు’’.. అని మరికొందరు, వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.