Husband: పెళ్లయిన 7 రోజులకే దారుణం.. విషం తాగి భర్త ఆత్మహత్య.. కారణమేంటా అని ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు..!
ABN , First Publish Date - 2023-07-22T21:44:19+05:30 IST
ఏ దంపతులైనా వివాహమైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే పోను పోను ఎక్కువగా మహిళలకు అనేక సమస్యలు ఎదురువుతుంటాయి. అదనపు కట్నం తేవాలని కొందరు, అక్రమ సంబంధం అనుమానంతో మరికొందరు తమ భార్యలను నిత్యం వేధిస్తుంటారు. మరికొందరు...
ఏ దంపతులైనా వివాహమైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే పోను పోను ఎక్కువగా మహిళలకు అనేక సమస్యలు ఎదురువుతుంటాయి. అదనపు కట్నం తేవాలని కొందరు, అక్రమ సంబంధం అనుమానంతో మరికొందరు తమ భార్యలను నిత్యం వేధిస్తుంటారు. మరికొందరు మహిళలు తమ అత్తమామల నుంచి కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే తాజాగా పంజాబ్‌లో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఓ వ్యక్తి వివాహమైన ఏడు రోజులకే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు కారణం ఏంటా అని ఆరా తీస్తే.. నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పంజాబ్ పాటియాలా జిల్లాలోని (Punjab Patiala District) బనూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మనౌలీ ప్రాంతానికి చెందిన దిల్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇతడికి కొన్ని నెలల కిందట జిరాక్‌పూర్ నివాసి మన్‌ప్రీత్ కౌర్ అనే యువతి (young woman) పరిచయమైంది. ఈమె స్థానికంగా బార్ అటెండర్‌గా పని చేస్తుండేది. ఓ వివాహ వేడుకలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కొన్నాళ్లకే ప్రేమకు దారి తీసింది. ఇటీవలే ఇద్దరూ వివాహం (love marriage) కూడా చేసుకున్నారు. అయితే వివాహమైన తర్వాత అత్తగారింట్లో ఉండేందుకు యువతికి నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు (quarrels) జరుగుతుండడంతో చివరకు దిల్‌ప్రీత్ సింగ్ కూడా భార్య పుట్టింటి వద్దే ఉంటున్నారు.
అయితే పెళ్లియిన మూడో నుంచే కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. దిల్‌ప్రీత్ సింగ్‌ను అతడి అత్త అవమానకంగా చూడడం మొదలెట్టింది. అంతటితో ఆగకుండా అందరి ముందూ అల్లుడిని హేళన చేస్తూ మాట్లాడుతూ తీవ్రంగా అవమానించేంది. దీంతో దిల్‌ప్రీత్ సింగ్ తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యాడు. ఈ విషయం తెలిసిన భార్య కూడా తన తల్లి వైపే మాట్లాడటం చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఏమనుకున్నాడో ఏమో గానీ.. వివాహమైన ఏడో రోజైన జూలై 17 తన ఇన్నోవా వాహనంలో సమీపంలోని ఓవర్‌బ్రిడ్జి వద్దకు వెళ్లి, విషం తాగి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు స్టేషన్ చేరుకుని.. తమ కొడుకు మృతికి కోడలు, ఆమె తల్లే కారణమని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.