చేయమన్నదొకటి.. చేసిన ఆపరేషన్ మరొకటి.. డాక్టర్ల నిర్వాకమిదీ.. పెళ్లికి పనికి రాకుండా చేశారంటూ కేసు పెట్టిన యువకుడు..!

ABN , First Publish Date - 2023-02-16T19:17:40+05:30 IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేని వారు.. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతో అనుభవం ఉన్న వైద్యులు ఉన్నా.. కొన్నిసార్లు నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి ఉంటుంది. మరికొన్ని సార్లు..

చేయమన్నదొకటి.. చేసిన ఆపరేషన్ మరొకటి.. డాక్టర్ల నిర్వాకమిదీ.. పెళ్లికి పనికి రాకుండా చేశారంటూ కేసు పెట్టిన యువకుడు..!

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేని వారు.. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతో అనుభవం ఉన్న వైద్యులు ఉన్నా.. కొన్నిసార్లు నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి ఉంటుంది. మరికొన్ని సార్లు మెరుగైన వైద్యం అందకపోగా.. అసలుకే ఎసరు వస్తుంటుంది. బీహార్‌లో తాగాజా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు షాక్ ఇచ్చారు. చేయాల్సిన ఆపరేషన్ కాకుండా మరో ఆపరేషన్ చేసి.. చివరకు పెళ్లికి పనికి రాకుండా చేశారంటూ యువకుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) కైమూర్‌లోని చైన్‌పూర్ పరిధి జాగారియా గ్రామానికి చెందిన రామ్ దహిన్‌సింగ్ యాదవ్‌కు మనక్క యాదవ్ అనే 30ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతడికి ఇటీవలే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేసేవారు. అయితే ఈ క్రమంలో అతడికి ఊహించని సమస్య వచ్చి పడింది. కొన్ని నెలలుగా అతడు హైడ్రోసిల్ (వృషణాల వద్ద బుడ్డ ఏర్పడడం) అనే సమస్యతో బాధపడుతున్నాడు. అయితే వీరి ఆర్థిక పరిస్థితి అంతంతే కావడం, ఎవరికైనా చెబితే పరువు పోతుందనే ఉద్దేశంతో యువకుడు ఇన్నాళ్లూ దాచి పెట్టాడు. ఇటీవల సమస్య ఎక్కువ అవడం.. మరోవైపు పెళ్లి ప్రయత్నాలు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన సమస్యను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించే స్థోమత లేక.. చివరకు స్థానికుల సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఈ యువకుడికి అసలైన సమస్య వచ్చిపడింది.

Viral Video: పెళ్లిలో డాన్స్ వేస్తూ కింద పడ్డాడని అంతా నవ్వుతోంటే.. ఆ పిల్లాడి తల్లి నుంచి ఊహించని రియాక్షన్..!

అతన్ని పరీక్షించిన ప్రభుత్వ డాక్టర్లు.. చివరకు ఆపరేషన్ (operation) చేయాలని చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. హైడ్రోసిల్ (Hydrocele) సమస్యకు ఆపరేషన్ చేయాల్సిన వైద్యులు.. చివరకు అతడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (male sterilisation) చేశారు. అనంతరం యువకుడితో.. ‘‘ మీకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది’’.. అని మంగళవారం రాత్రి వైద్యులు చెప్పారు. దీంతో సదరు యువకుడు ఖంగుతిన్నాడు. మా కొడుకు సమస్య ఏంటీ... మీరు చేసిందేంటీ.. అని బాధితుడి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇప్పుడు తమ కొడుకు పరిస్థితి ఏంటని.. ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: మహా అయితే పిల్ల పాము ఉంటుందనుకున్నారు.. చివరకు అష్టకష్టాలు పడి ఇంటి సీలింగ్‌ బద్దలు కొట్టి చూడగా..

Updated Date - 2023-02-16T19:44:54+05:30 IST