Crime News: అమ్మ బాబోయ్.. ఇదేం ప్లాన్..? ఎవరైనా ఫోన్ చేసి ఇలా మాట్లాడితే అస్సలు నమ్మొద్దు.. ఓ యువతి వద్ద రూ.7 లక్షలు మటాష్..!
ABN , First Publish Date - 2023-05-27T21:37:32+05:30 IST
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు ఎంతటి నేరాలు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు ఎలాంటి ప్రత్యక్ష దాడులు చేయకుండా.. తెలివి తేటలు ప్రదర్శిస్తూ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేరస్థుల మాటలు వింటే.. చదువుకున్న వారు కూడా బోల్తా పడేలా ఉంటాయి. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు ఎంతటి నేరాలు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు ఎలాంటి ప్రత్యక్ష దాడులు చేయకుండా.. తెలివి తేటలు ప్రదర్శిస్తూ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేరస్థుల మాటలు వింటే.. చదువుకున్న వారు కూడా బోల్తా పడేలా ఉంటాయి. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో లక్షల రూపాయలు కొళ్లగొట్టే నేరస్థులను చాలా మందిని చూశాం. పూణేలో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో నేరస్థుల తెలివి తేటలు చూస్తే షాకవడం మాత్రం ఖాయం. సైబర్ నేరగాళ్లు చెప్పింది విని ఓ యువతి తెగ భయపడిపోయింది. చివరకు ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.7లక్షలు మటాష్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పూణేకు (Maharashtra Pune) చెందిన 26ఏళ్ల యువతి.. స్థానికంగా ఉన్న ఓ ఐటీ కంపెనీలో (IT company) పని చేస్తుంటుంది. ఈమెకు ఏప్రిల్ 18న గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీరు పంపిన పార్సిల్ వచ్చింది.. అందులో డ్రగ్స్ (Drugs) ఉన్నాయని పోలీసులు తెలిపారు.. కేసు కూడా నమోదు చేశారు’’.. అని చెప్పారు. ఈ మాటతో యువతి (young woman) షాక్‌కు గురైంది. ‘‘నేనేంటీ.. పార్సిల్ పంపడమేంటీ.. అందులో డ్రగ్స్ ఉండడం ఏంటి.. నేను ఎవరికీ పార్సిల్ పంపలేదు’’.. అని సమాధానం ఇచ్చింది. అయితే అందుకు అవతలి వ్యక్తి.. పోలీసులతో మాట్లాడమని చెప్పాడు. మరుక్షణమే ఆ కాల్ మరొకరికి బదిలీ అయింది. అవతలి వ్యక్తి తనని తాను పోలీసుగా పరిచయం చేసుకున్నాడు.
అవతలి వ్యక్తి కూడా ఇలాగే చెప్పి.. ‘‘మీ సమస్య పరిష్కారం కావాలంటే ముందు మొబైల్‌లో యాప్ ఎక్కించుకోండి’’.. అంటూ ఓ యాప్ లింక్‌ను (App link) ఆమెకు పంపించారు. అందులో ఆమె రిజిస్ట్ అవగానే.. మళ్లీ అతను ఫోన్ చేశాడు. ఆమె ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని.. సమస్యను పరిష్కరించే క్రమంలో బ్యాంకు ఖాతాను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందుకోసం ముందుగా ఆమె బ్యాంక్‌లోని నగదును ఖాళీ చేసి, తాము చెప్పిన అకౌంట్‌లో జమ చేయాలని చెప్పాడు. విచారణ అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెప్పారు. పోలీసులు అని చెప్పడంతో యువతి కూడా భయపడిపోయి.. వారు చెప్పినట్లుగానే చేసింది. బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ చేసిన తర్వాత.. వారి ఫోన్ నంబర్లు పని చేయలేదు. మోసపోయానని తెలుసుకుని చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.