Marriage: ప్రేయసిని కలిసి రాత్రికి రాత్రే వెళ్లిపోదామనుకున్నాడు కానీ.. మర్నాడే ఆ ఇంటికి అల్లుడిగా మారాడు.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-05-27T19:56:46+05:30 IST
ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు, మరికొన్ని సార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమికులకు అటు అబ్బాయి కుటుంబం నుంచో లేదా ఇటు అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచో సమస్యలు తలెత్తుంటాయి. అలాంటి సందర్భాల్లో..
ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు, మరికొన్ని సార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమికులకు అటు అబ్బాయి కుటుంబం నుంచో లేదా ఇటు అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచో సమస్యలు తలెత్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రేమికులు పెళ్లి వరకూ వెళ్లాలంటే పెద్ద సమస్యగా మారుతుంటుంది. అయితే కొందరి విషయంలో ఎలాంటి కష్టం లేకుండా వివాహం జరిగిపోతుంటుంది. తాజాగా, బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రేయసిని కలిసి రాత్రికి రాత్రే ఇంటికి వెళ్లిపోవాలి అనుకున్నాడు. అయితే మర్నాడే ఆ ఇంటికి అల్లుడిగా మారాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ (Bihar) ఛప్రా పరిధి భల్వహియా గ్రామానికి చెందిన నీతూ కుమారి అనే యువతికి చాంద్‌పురా పంచాయతీ బీర్‌కురి గ్రామానికి చెందిన బిట్టు కుమార్‌తో నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో (Social media) పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త కొంత కాలానికే ప్రేమగా (love) రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లలో తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి బిట్టు కుమార్.. తన ప్రియురాలిని కలిసేందుకు గ్రామానికి వెళ్లాడు.
ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా స్థానికుల దృష్టిలో పడ్డారు. దీంతో వెంటనే అతన్ని (villagers caught the lovers) పట్టుకుని విచారించారు. చివరకు విషయం తెలుసుకుని అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరినీ స్థానిక సతీదేవి ఆలయానికి తీసుకెళ్లారు. పెళ్లి దుస్తులు వేసుకోమని చెప్పి పీటలపై కూర్చోబెట్టారు. గ్రామస్తులందరి సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. ఈ పెళ్లికి ఇరు వైపు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎలాంటి సమస్యా లేకుండా పోయింది. కాగా, ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘గ్రామస్తులు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు’’.. అని కొందరు, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.