Shocking: అద్దంపై ఏదో పడిందని.. కారును రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్.. కిందకు దిగి శుభ్రం చేస్తుండగా సడన్‌గా షాకింగ్ సీన్..!
ABN , First Publish Date - 2023-09-08T16:03:33+05:30 IST
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం.. మరికొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. చాలా మంది ఎలాంటి నిబంధనలు పాటించకుండా రోడ్లపై ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి వారి కారణంగానే..
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం.. మరికొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. చాలా మంది ఎలాంటి నిబంధనలు పాటించకుండా రోడ్లపై ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి వారి కారణంగానే ప్రమాదాల శాతం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు అద్దంపై ఏదో పడడడంతో డ్రైవర్.. రోడ్డు పక్కన ఆపి కిందకు దిగి శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో సడన్‍గా ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Uttar Pradesh Ghaziabad) రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని వీవీఐపీ మాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అవిష్ బెహ్ల్ అనే వ్యక్తి.. ఫ్రాన్స్ (France) వెళ్తున్న తన తమ్ముడు అవిష్‌ను ఎయిర్‌పోర్టులో (Airport) దింపేందుకు కుటుంబంతో కలిసి బయలుదేరాడు. అయితే వీవీఐపీ మాల్ సమీపానికి చేరుకోగానే కారు ముందు అద్దంపై ఏదో పడడంతో రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో అద్దాన్ని శుభ్రం చేసేందుకు కారును రోడ్డు పక్కన ఆపారు. కారు అద్దం శుభ్రం చేస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు అవిష్ కారును (Another car hit the car) బలంగా ఢీకొట్టింది. దీంతో హ్యాండ్ బ్రేక్‌లో ఉన్న కారు కూడా 50 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అవిష్ తల్లి జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో ముగ్గురు యువకులు ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారని బాధితులు తెలిపారు. ప్రమాదం జరగ్గానే కారులో ఉన్న ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.